అడవిలో మిగతా జంతువులతో పోల్చితే సింహం చాలా ధైర్యంగా తిరుగుతుంది. ఇతర జంతవులు నుంచి తనకు ఎలాంటి ఆపద ఎదురు కాదనే ధైర్యంతోనే అలా చేస్తుంది. ఇతర జంతువులు కూడా సింహానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయవు. ఎందుకు వచ్చిన గొడవ అని సింహానికి అంత దూరంగానే వెళ్లిపోతాయి. కానీ, తాజాగా ఓ జంతువు సింహాన్నే వణించింది. ఇంతకీ అది ఏ జంతువంటే..
మృగరాజును భయపెట్టిన బేబీ సింగం
మృగరాజును భయపెట్టిన జంతువు మరేదో కాదు, బేబీ సింగం. అవును మీరు వింటున్నది నిజమే.. తన తండ్రి సింహాన్ని చడీ చప్పుడు లేకుండా వచ్చి వణించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ద బండరాయి పక్కన మృగరాజు పడుకుని రెస్ట్ తీసుకుంటుంది. బండకు అతవలి వైపున తల్లి సింహంతో పాటు దాని పిల్లలు ఉన్నాయి. ఇంతలో ఓ బేబీ సింగ.. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి గట్టిగా శబ్దం చేస్తుంది. వెంటనే తండ్రి సింహం భయంతో వణికిపోతాడు. మృగరాజును బయపెట్టిన సింబాగాడిని చూసి నెటిజన్లు క్రేజీగా ఫీలవుతున్నారు.
Read Also: అమెజాన్ లో ఏకంగా ఇంటినే ఆర్డర్ పెట్టిన ఘనుడు.. వెంటనే డెలివరీ!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ రేర్ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా ఈ వీడియో చాలా అద్భుతంగా ఉందంటున్నారు. బేబీ యాక్షన్, తండ్రి రియాక్షన్ చూసి ఫన్నీగా ఫీలవుతున్నారు. చిన్నప్పుడే తండ్రిని భయపెట్టిన ఈ బేబీ సింగం.. పెద్ద అయితే ఎలా ఉంటుందో? అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో బేబీ సింహంలోని కొంటె తనం అందరినీ ఆకట్టుకుంటుంది. సింహం పిల్ల కాబట్టి సరిపోయింది. అదే ప్లేస్ లో మరే జంతువు ఉన్నా, క్షణాల్లో దానికి ఆహారం అయిపోయేది అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందరికీ వినోదాన్ని పంచుతుంది.
Read Also: ఆమె మెట్రో రైలు ప్రమాదంలో చనిపోయింది.. కానీ, ఆమె ఫోన్ నుంచి కొడుకు, చెల్లికి కాల్స్.. అదెలా?