E-Paper
Advertisement

వాంఖ‌డే స్టేడియంలోనే హార్దిక్ ప్యాండ్యా.. ముంబై భ‌ర‌తం ప‌డ‌తాడు

వాంఖ‌డే స్టేడియంలోనే  హార్దిక్ ప్యాండ్యా.. ముంబై భ‌ర‌తం ప‌డ‌తాడు
Advertisement

Kris Srikkanth On Hardik Pandya:  ఐపీఎల్ 2027 నేప‌థ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్ళాడు అతని బలవంతంగా పంజాబ్ లోకి ముంబై ఇండియన్స్ యాజమాన్యం పంపిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి అత్యంత ప్రమాదకరమైన ఆటగాన్ని అనవసరంగా ముంబై ఇండియన్స్ వదులుకుందని అభిప్రాయపడ్డాడు. అలాంటోడు ముంబై ఇండియన్స్ కు మళ్ళీ దొరకడని తెలిపాడు. అయితే తనను అవమానించిన ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా కచ్చితంగా పగ తీర్చుకుంటాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్ 2027లో ముంబైపై సెంచరీ చేసి తన ప్రతాపం చూపిస్తాడని హెచ్చరించాడు. దీనికి చాలా రోజులు పట్టదని.. ముంబై భారీ నష్టాన్ని చవిచూస్తుందని అంచనా వేశాడు

వాంఖ‌డే స్టేడియంలోనే ముంబైపై ప్ర‌తీకారం తీర్చుకుంటాడు

ముంబై ఇండియన్స్ జట్టు నుంచి పంజాబ్ కింగ్స్ లోకి వెళ్లిన హార్దిక్ పాండ్యా పై కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి హార్దిక్ పాండ్యా కసిగా ఉన్నాడని ఈ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ ను ఓడించేందుకు హార్థిక్ పాండ్యా మరింత కష్టపడి పంజాబ్ కింగ్స్ ను విజయతీరాలకు చేర్చుతాడని వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టులో అతడికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉందని… కానీ అతడికి అది కలిసి రాలేదని తెలిపాడు. దాని ఫలితంగానే అతన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం బయటకు పంపినట్టు తెలిపాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

దాన్ని వినియోగించుకున్న పంజాబ్ కింగ్స్ వెంటనే పాండ్యాను ట్రేడ్ చేసుకుంద‌ని వివరించాడు. ఐపీఎల్ 2027 టోర్నమెంటులో ఎన్నడు లేని ఆటను హార్దిక్ పాండ్యాను ప్రదర్శిస్తాడని… దాని కోసం అత‌డు వేచి చూస్తున్నాడని వెల్లడించాడు. వాంఖ‌డే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై ఆడుతూ హార్థిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంటాడని కూడా వ్యాఖ్యానించాడు. అప్పుడే ముంబై ఇండియన్స్ కు పాండ్యా సరైన బుద్ధి చెప్పినట్టు అవుతుందని వివరించాడు.

హార్దిక్ పాండ్యాపై పంజాబ్ కోట్ల వర్షం

Advertisement

ఐపీఎల్ 2027 ట్రేడ్ ప్రక్రియలో భాగంగా హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ ను ముంబై ఇండియన్స్ కు పంపింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరఫున 16.35 కోట్లు గతంలో అందుకున్న హార్దిక్ పాండ్యా… పంజాబ్ నుంచి 18 కోట్లు తీసుకుంటున్నాడు. ఇటు అర్షదీప్ సింగ్ ధరలో ఎలాంటి మార్పులు లేకుండా 18 కోట్లు ముంబై ఇండియన్స్ ఇస్తోంది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

వ‌న్డేల్లోనూ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే, 50 ఓవ‌ర్ల‌లో 600 కొట్ట‌డం ప‌క్కా

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!

దక్షిణాఫ్రికా పిచ్‌లను గిల్ తట్టుకోలేడు… 2027 వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాఫ్ అవుతాడు!

ఐపీఎల్ 2027లోకి బంగ్లాదేశ్ ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్

ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

టీమిండియాలో ముస్లింల‌కు అన్యాయం..అందుకే మ‌హ్మ‌ద్ ష‌మీ రిటైర్మెంట్ ?

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడిని ఓ బ‌చ్చాగాడిలా ట్రీట్ చేసి అవ‌మానించా!

Big Stories

Advertisement
×