E-Paper
Advertisement

ఐపీఎల్ 2027లోకి బంగ్లాదేశ్ ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్

ఐపీఎల్ 2027లోకి బంగ్లాదేశ్ ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్
Advertisement

PSL vs IPL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు (Indian Premier League 2027 Tournament) సంబంధించిన వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు సిద్ధం అవుతున్నాయి. ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎలాగైనా ఆడాలని బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ముస్తాఫిజుర్ రెహమాన్, నహిద్ రాణా, రిషాద్ హుస్సేన్ లాంటి భయంకరమైన ప్లేయర్లు ఐపీఎల్ వేలం కోసం తాజాగా రిజిస్టర్ చేయించుకున్నారు. బీసీసీఐ నుంచి పర్మిషన్లు రావడంతో బంగ్లా ప్లేయర్లు కూడా రంగంలోకి దిగబోతున్నారు. అయితే, బంగ్లాదేశ్ ప్లేయర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం వచ్చి పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ వచ్చే సీజన్ కు దూరం కానున్నారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు.

ఐపీఎల్‌లోకి బంగ్లా ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్

ఐపీఎల్ 2027, పీఎస్ఎల్ 2027 ఒకేసారి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు టోర్నమెంట్లు కూడా మార్చి 10వ తేదీన ప్రారంభం కానున్నట్టు సమాచారం అందుతోంది. అంతేకాదు, పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడితే 100 రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది. ఐపీఎల్ లో ఒక్క సీజన్ ఆడితే లైఫ్ సెటిల్ అవుతుంది. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో 10 ఏళ్లు ఆడినా, ఇంట్లో పిల్లల డైపర్లకు సరిపడా డబ్బులు రావు. ఈ లెక్కలు వేసుకున్న బంగ్లా ప్లేయర్లు ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతారు. ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

అటు పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ను దెబ్బ కొట్టేందుకే బంగ్లాదేశ్ ప్లేయర్లపై బ్యాన్ ను బీసీసీఐ ఎత్తేసినట్టు ఫైర్ అవుతున్నారు. గతేడాది బంగ్లా ప్లేయర్లను దూరం పెట్టిన బీసీసీఐ, ఈ సారి ఎందుకు ఆడిస్తోందని ఆగ్రహిస్తున్నారు. కేవలం పీసీబీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు పోస్టులు పెడుతున్నారు. బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని పాకిస్తాన్ మాజీలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అటు మొహ్సిన్ నఖ్వీ…ఈ పరిస్థితి ఎలా ఎదుర్కొవాలనే దానిపైన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా ఐపీఎల్ 2027 వేలం డిసెంబర్ 16వ తేదీన గోవా వేదికగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 17వ తేదీ లోపు రిటెన్షన్, రిలీజ్ లిస్టులను ఐపీఎల్ కౌన్సిల్ కు పది ఫ్రాంచైజీలు అప్పగించాల్సి ఉంటుంది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

టీమిండియాలో ముస్లింల‌కు అన్యాయం..అందుకే మ‌హ్మ‌ద్ ష‌మీ రిటైర్మెంట్ ?

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడిని ఓ బ‌చ్చాగాడిలా ట్రీట్ చేసి అవ‌మానించా!

ఐపీఎల్ వేలంలో ఆర్య‌వీర్ సెహ్వాగ్ రూ.10 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది

టాస్ వేయ‌కుండా శాంట్న‌ర్ ను నెట్టేసిన గిల్..మూడో వ‌న్డేపై అనుమానాలు

కొనేవాడు దిక్కులేక‌ షాహిద్ అఫ్రిది బంప‌ర్ ఆఫ‌ర్..5 జ‌త‌ల దుస్తులు కొంటే ఓ వీడియో కాల్

Big Stories

Advertisement
×