E-Paper
Advertisement

టీమిండియాలో ముస్లింల‌కు అన్యాయం..అందుకే మ‌హ్మ‌ద్ ష‌మీ రిటైర్మెంట్ ?

టీమిండియాలో ముస్లింల‌కు అన్యాయం..అందుకే మ‌హ్మ‌ద్ ష‌మీ రిటైర్మెంట్ ?
Advertisement

Abdul Razzaq On Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత వారం రోజుల కిందట రిటైర్మెంట్ ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం తాను కొనసాగుతానని ఊరట కల్పించాడు. మహమ్మద్ షమీ రిటైర్మెంట్ పై తీవ్రస్థాయిలో దుమారం రాజుకుంది. అజిత్ అగార్కర్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) ఇద్దరు కలిసి మహమ్మద్ షమీ కెరీర్ నాశనం చేశారని విమర్శలు వస్తున్నాయి. వీళ్లు సరిగ్గా అవకాశాలు ఇవ్వకుండా అతన్ని ఆడుకున్నారని.. వేధించారని మండిపడుతున్నారు అభిమానులు. ఇప్పటికైనా వన్డేల్లో మహమ్మద్ షమీని తీసుకుని… 2027 వన్డే వరల్డ్ కప్ ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.

టీమిండియాలో ముస్లింల‌కు అన్యాయం…అందుకే ష‌మీ రిటైర్మెంట్!

టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహమ్మద్ షమీని (Mohammed Shami) ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq On Mohammed Shami ) తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. ముస్లిం క్రికెటర్ కాబట్టే మహమ్మద్ షమీకి టీమిండియాలో సరిగ్గా అవకాశాలు రావడంలేదని నిప్పులు చెరిగాడు. భారతీయ జనతా పార్టీలో పని చేసి వచ్చిన గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్ గా పనికిరాడ‌ని ఆగ్రహించాడు. బిజెపి వాళ్లకు ముస్లింలు అంటే అస్సలు పడ‌ద‌ని.. గౌతమ్ గంభీర్ కూడా అదే ఆలోచనతో ఉన్నాడని ఆరోపించాడు. అందుకే టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలను దూరం పెట్టాడని విమర్శలు చేశాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం మహమ్మద్ సిరాజును తీసుకుంటే.. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ఇటు మహమ్మద్ షమీని మొదటి నుంచి వేధిస్తూ రిటైర్మెంట్ తీసుకునేలా చేశాడని గంభీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముస్లిం క్రికెటర్లు అంటే గంభీర్ కు అస్సలు పడదని… అందుకే ఇలా తరచూ పక్కకు పెడుతున్నాడని విమర్శలు చేశాడు. ఇండియాలో ఇబ్బందిగా ఉంటే తమ పాకిస్తాన్ కు మహమ్మద్ షమీ రావచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.. పాకిస్తాన్ కు మ‌హ్మ‌ద్ ష‌మీ వ‌స్తే,మెరుగైన అవకాశాలు కల్పిస్తామని తెలిపాడు. దీంతో మహమ్మద్ షమీ రిటైర్మెంట్ పై అబ్దుల్ రజాక్ (abdul razzak) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, అబ్దుల్ ర‌జాక్ చేసిన వ్యాఖ్య‌ల‌పై గంభీర్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వాడికి అస‌లు క్రికెట్ పై అవ‌గాహ‌న లేదంటూ ఫైర్ అయ్యాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

Related News

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడిని ఓ బ‌చ్చాగాడిలా ట్రీట్ చేసి అవ‌మానించా!

ఐపీఎల్ వేలంలో ఆర్య‌వీర్ సెహ్వాగ్ రూ.10 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

పాకిస్తాన్ త‌ర‌ఫున అడితే అభిషేక్, ఇషాన్ బండారం బ‌య‌ట ప‌డుతుంది

టాస్ వేయ‌కుండా శాంట్న‌ర్ ను నెట్టేసిన గిల్..మూడో వ‌న్డేపై అనుమానాలు

కొనేవాడు దిక్కులేక‌ షాహిద్ అఫ్రిది బంప‌ర్ ఆఫ‌ర్..5 జ‌త‌ల దుస్తులు కొంటే ఓ వీడియో కాల్

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!

Big Stories

Advertisement
×