
SRILANKA : ఆ జట్టు వరల్డ్ కప్ లో కొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ రూపురేఖలనే మార్చేసింది. తొలి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై ఎటాక్ చేసే వ్యూహంతో ఛాంపియన్ గా నిలిచింది. ఆ టీమే శ్రీలంక.
1996 వరకు అన్ని జట్లు శ్రీలంకను పసికూనగానే భావించాయి. అప్పటి వరకు ఆ జట్టు వన్డే ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది. కానీ 1996 వన్డే మెగాటోర్నిలో లంక జట్టు సింహంలా గర్జించింది. అప్పటి వరకు వన్డే క్రికెట్ లో తొలి 15 ఓవర్లలో వికెట్లను కాపాడుకోవడమే ప్రతి జట్టు వ్యూహం. కానీ శ్రీలంక మాత్రం ఫస్ట్ ఓవర్ నుంచి ఎటాక్ దిగే వ్యూహాన్ని అమలు చేసింది. ఫీల్డింగ్ నిబంధనలను యూజ్ చేసుకుని లంక ఓపెనర్లు సనత్ జయసూర్య, రమేష్ కలువితరణ పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశారు. ఫీల్డర్ల తలపై నుంచి షాట్లు కొడుతూ జయసూర్య సరికొత్త శకాన్ని సృష్టించాడు. ఈ వ్యూహం ఫలించింది. టాప్ టీమ్స్ ను చిత్తుచేసి.. అర్జున్ రణతుంగ కెప్టెన్సీలో తొలిసారి ప్రపంచ్ కప్ ను శ్రీలంక కైవసం చేసుకుంది.
కెప్టెన్ రణతుంగ సంచలన నిర్ణయాలు, స్టార్ బ్యాటర్ అరవింద్ డిసిల్వా నిలకడ ప్రదర్శన, చామిందా వాస్ బౌలింగ్ మెరుపులు, ముత్తయ్య మురళీధర్, కుమార ధర్మసేన, జయసూర్య స్పిన్ మాయాజాలం లంకను అజేయంగా నిలిపాయి. లీగ్ దశలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో జయసూర్య విధ్వంసం భారత్ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ కెరీర్ కు ముగింపు పలికింది. జయసూర్యకు ఎలా బౌలింగ్ చేయాలో అర్థంగా చివరికి ఆ మ్యాచ్ లో పేసర్ మనోజ్ ప్రభాకర్.. స్పిన్ బౌలింగ్ చేయడం విశేషం. అదే అతడి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. సెమీస్ లోనూ భారత్ ను శ్రీలంక చిత్తు చేసింది. లంక స్పిన్ వలలో భారత్ విలవిలలాడింది. ఈ టోర్నిలో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడని శ్రీలంక..ఫైనల్ లో ఆసీస్ ను చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.
2007లో లంక రెండోసారి ఫైనల్ కు చేరింది. ఆస్ట్రేలియా చేతిలో తుది పోరులో ఓడినా .. ఆ జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఇక 2011లోనూ శ్రీలంక జట్టే ఫైనల్ కు చేరుకుంది. లంకను ఓడించే భారత్ రెండోసారి వరల్డ్ ను సాధించింది. 2015, 2019 మెగా టోర్నిలో శ్రీలంక అంతగా రాణించలేదు. దిగ్గజ ఆటగాళ్లు తప్పుకోవడంతో ఆ జట్టు బలహీన పడింది. అయితే 2023 వరల్డ్ కప్ లో మాత్రం లంక సంచలన ప్రదర్శన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఉపఖండం పిచ్ లు స్పిన్నర్లకు స్వర్గధామం. దునిత్ వెల్లలాగా, హసరంగ, ధనుంజయ డిసిల్వా, తీక్షణ లాంటి స్పినర్లతో ఆ జట్టు బలంగా ఉంది. మలింగను తలపిస్తూ.. పేసర్ పతిరన అదరగొడుతున్నాడు. అటు నిస్సాంక, అసలంక, సమరవిక్రమ, కుశాల్ మెండీస్ లాంటి యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. మరి లంక సంచలనాలు సృష్టిస్తుందా..?
DK Shiva Kumar : కాంగ్రెస్ అభ్యర్థుల ట్రాప్ కు ప్రయత్నం.. కేసీఆర్ పై డీకే సంచలన ఆరోపణలు..