BigTV English

RCB – Stampede: RCB కి మరో ఎదురు దెబ్బ.. ఇకపై చిన్న స్వామిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేది లేదు.. ఆ గ్రౌండ్ పై నిషేధం?

RCB – Stampede: RCB కి మరో ఎదురు దెబ్బ.. ఇకపై చిన్న స్వామిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడేది లేదు.. ఆ గ్రౌండ్ పై నిషేధం?

RCB – Stampede: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} జట్టు మొదటిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత.. మరుసటి రోజు ఆర్సిబి హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో గ్రాండ్ సెలబ్రేషన్ నిర్వహించారు. జూన్ 4వ తేదీన నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏకంగా పదకొండు మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.


Also Read: Sai Sudarshan: సాయి సుదర్శన్ సైంటిస్టుల రాస్తున్నాడు.. శిష్యుడిలా సుందర్ చూస్తున్నాడు… ఏంట్రా ఇద్దరి గోల.. ముందు టీమిండియాను గెలిపించండిరా

ఆర్సిబి ఆటగాళ్లు టీం ట్రోఫీతో వస్తుంటే చూసి.. వారిని అభినందించేందుకు మైదానానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. 17 సీజన్లుగా కప్పు గెలవకపోయిన ఆర్సిబి.. ఫైనల్ గా 18 వ సీజన్ లో తమ తొలి ఐపిఎల్ ట్రోఫీ సాధించడంతో బెంగుళూరులో సీఎం సిద్దరామయ్య ఆర్సిబి ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు.


ముందు విధాన సౌధకు చేరుకొని.. అక్కడ సీఎంని కలిసి, అక్కడినుండి చిన్నస్వామి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. దీంతో విధాన సౌధ నుండి నేరుగా ఆటగాళ్లు స్టేడియానికి చేరుకున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో తొక్కీసలాట చోటు చేసుకుంది. అనంతరం నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు.

ఆ తరువాత ఈ కేసు హైకోర్టుకు చేరింది. బెంగళూరు జట్టు ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక ఈ తొక్కిసలాటకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆర్సిబి ఫ్రాంచైజీ నుంచి తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఎత్తి చూపించింది కర్ణాటక ప్రభుత్వం. ఇదిలా ఉంటే తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇకపై చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించకూడదని.. ఆ గ్రౌండ్ పై నిషేధం విధించాలని భావిస్తుందట బీసీసీఐ. అలాగే పెద్ద సంఖ్యలో జన సమూహాలు ఉండే ఈవెంట్లను.. ఇతర వేదికలకు మార్చాలని భావిస్తుందట. భవిష్యత్తులో ఏదైనా వేదిక అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, చిన్న స్వామి స్టేడియం సామూహిక సమావేశాలకు అనుకూలమైనది కాదని తేల్చింది జస్టిస్ జాన్ మైకేల్ కున్హా కమిషన్.

Also Read: Azam Khan: 69 కిలోలు తగ్గిన పాకిస్తాన్ వికెట్ కీపర్.. మొత్తం బీఫ్ తినడం మానేశాడా!

ఈ నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. ఇకనుండి చిన్నస్వామి స్టేడియంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం రద్దు చేయబడుతుంది. తదుపరి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ సిఫార్సులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇకనుండి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు, సమావేశాలను పూర్తిగా రద్దు చేస్తే.. ఐపీఎల్ 2026 సీజన్ లో ఆర్సిబి హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించరు. ఇదే జరిగితే ఆర్సిబి అభిమానులకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

Related News

AFG vs SL, Asia Cup 2025: నేడు లంకతో మ్యాచ్..ఆఫ్ఘనిస్తాన్ కు చావో రేవో..గెలిచిన జ‌ట్టుకు సూప‌ర్ 4 ఛాన్స్ !

Pakistan vs UAE: ఎంత‌కు తెగించార్రా…అంపైర్ పై పాకిస్థాన్ దాడి..మ్యాచ్ మ‌ధ్య‌లోనే !

Asia Cup 2025 : హై డ్రామా మ‌ధ్య యూఏఈ పై పాక్ విక్ట‌రీ.. 21న‌ ఇండియా-పాక్ మ్యాచ్

PAK vs UAE : పాకిస్తాన్ కు షాక్ మీద షాక్.. UAE మ్యాచ్ రిఫరీగా ఆండీ

Asia Cup 2025: పాకిస్తాన్ కు రూ. 285 కోట్ల నష్టం…ఐసీసీ దెబ్బ అదుర్స్ ?

Usain Bolt : ఉసెన్ బోల్ట్ ప్రమాదంలో ఉసేన్‌ బోల్ట్‌… ఒకప్పుడు బుల్లెట్ లాగా దూసుకు వెళ్ళాడు…ఇప్పుడు మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు

Pak – ICC: పాకిస్థాన్ దెబ్బ‌కు దిగివచ్చిన ఐసీసీ…క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఆండీ !

Asia Cup 2025 : యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు… ఆసియా నుంచి ఔట్?

Big Stories

×