BigTV English

Azam Khan: 69 కిలోలు తగ్గిన పాకిస్తాన్ వికెట్ కీపర్.. మొత్తం బీఫ్ తినడం మానేశాడా!

Azam Khan: 69 కిలోలు తగ్గిన పాకిస్తాన్ వికెట్ కీపర్.. మొత్తం బీఫ్ తినడం మానేశాడా!

Azam Khan: పాకిస్తాన్ క్రికెట్ లో ఇటీవల ఎక్కువగా వినిపించే పేరు అజామ్ ఖాన్. భారీ కాయంతో ఉండే ఈ వికెట్ కీపర్.. తన ఆహారపు అలవాట్లు, వికెట్ కీపింగ్, బ్యాటింగ్ తో చాలాకాలంగా విమర్శల పాలవుతున్నాడు. కొన్నిసార్లు తన తప్పు లేకుండానే ఈ ప్లేయర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అతడి ప్రదర్శన బాగా లేకున్నా.. బంధుప్రీతితో అతడిని టీ-20 ప్రపంచ కప్ 2024 కి ఎంపిక చేశారు అనే ఆరోపణలు వచ్చాయి.


Also Read: Yashasvi Jaiswal: బ్యాట్ విరగ్గొట్టిన యశస్వి జైస్వాల్ .. ఇదిగో వీడియో

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ కుమారుడు అయినందువల్లే అతడికి అవకాశాలు వచ్చాయని పలువురు మాజీ క్రికెటర్లు చాలాసార్లు విమర్శలు గుప్పించారు. ఆజాం ఖాన్ కూడా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టి-20 ప్రపంచ కప్ 2024 కోసం ఆజాం ఖాన్ ని ఎంపిక చేసిన సమయంలో సొంత జట్టు అభిమానులే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


బంధుప్రీతితో ఇలాంటి వాళ్లను ఎంపిక చేస్తే టి-20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలలో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లను విమర్శించారు. ఇక భారీ కాయుడైన అజాం ఖాన్ పై తరచూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వస్తుంటాయి. అతడి ఫిట్నెస్ నీ ఉద్దేశిస్తూ నెటిజెన్లు ట్రోల్స్ కి దిగుతుంటారు. అలాంటి అజాం ఖాన్ ప్రస్తుతం తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. కేవలం రెండు నెలల్లో ఏకంగా 69 కేజీల బరువు తగ్గాడు అజాం ఖాన్.

అతడి ఫిట్నెస్ పై తీవ్రస్థాయిలో ట్రోల్స్ రావడం, పలు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఫిట్నెస్ పై దృష్టి సారించాడు. దీంతో కేవలం రెండు నెలల్లోనే ఏకంగా 69 కిలోల బరువు తగ్గాడు. దీంతో అతడు స్లిమ్ గా మారిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు.. అతడు బీఫ్ తినడం మానేసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2021 లో ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల అజాం ఖాన్.. ఇప్పటివరకు టి-20ల్లో మాత్రమే ఆడాడు.

Also Read: Chahal – Mahvash: లండన్ లో అడ్డంగా దొరికిపోయిన టీమిండియా ప్లేయర్.. భార్యను కాదని ప్రియురాలితో !

ఇప్పటివరకు 14 టీ-20 మ్యాచ్ లు ఆడిన అజాం ఖాన్ 9.78 యావరేజ్ తో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ టి-20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐతే అతడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ కుమారుడు కావడం వల్లే అతడిని జట్టులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి భారీగా బరువు తగ్గి స్లిమ్ గా మారాడు కానీ.. తన ఆట తీరుతో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది వేచి చూడాలి.

Related News

AFG vs SL, Asia Cup 2025: నేడు లంకతో మ్యాచ్..ఆఫ్ఘనిస్తాన్ కు చావో రేవో..గెలిచిన జ‌ట్టుకు సూప‌ర్ 4 ఛాన్స్ !

Pakistan vs UAE: ఎంత‌కు తెగించార్రా…అంపైర్ పై పాకిస్థాన్ దాడి..మ్యాచ్ మ‌ధ్య‌లోనే !

Asia Cup 2025 : హై డ్రామా మ‌ధ్య యూఏఈ పై పాక్ విక్ట‌రీ.. 21న‌ ఇండియా-పాక్ మ్యాచ్

PAK vs UAE : పాకిస్తాన్ కు షాక్ మీద షాక్.. UAE మ్యాచ్ రిఫరీగా ఆండీ

Asia Cup 2025: పాకిస్తాన్ కు రూ. 285 కోట్ల నష్టం…ఐసీసీ దెబ్బ అదుర్స్ ?

Usain Bolt : ఉసెన్ బోల్ట్ ప్రమాదంలో ఉసేన్‌ బోల్ట్‌… ఒకప్పుడు బుల్లెట్ లాగా దూసుకు వెళ్ళాడు…ఇప్పుడు మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు

Pak – ICC: పాకిస్థాన్ దెబ్బ‌కు దిగివచ్చిన ఐసీసీ…క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఆండీ !

Asia Cup 2025 : యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు… ఆసియా నుంచి ఔట్?

Big Stories

×