E-Paper
Advertisement

Shubman Gill : దూకుడు పనికిరాదు.. గిల్‌కు గవాస్కర్ వార్నింగ్..

Shubman Gill : దూకుడు పనికిరాదు.. గిల్‌కు గవాస్కర్ వార్నింగ్..
Advertisement

Shubman Gill : 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత నుంచి శుభ్ మన్ గిల్ ఆట లయ తప్పింది. తర్వాత ఆడిన ఏ మ్యాచ్ లో కూడా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇది తనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సలహాలిచ్చే సీనియర్లు కూడా గిల్ ని టార్గెట్ చేయడం సరికాదని అంటున్నారు.

భారత జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఈ సమయంలో జట్టుకి బలంగా ఉండాలి తప్ప, బలహీనంగా మారకూడదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వన్డేలు మినహా టెస్టు, టీ20 ఫార్మాట్‌లో తేలిపోతున్నాడని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. భారత్ జట్టులో ఉండే తీవ్రమైన పోటీనీ అర్థం చేసుకుని నిలకడగా పరుగులు చేయాలని సూచించాడు.

Advertisement

గిల్ బ్యాటింగ్‌పై సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. టెస్టు క్రికెట్ ఆడుతున్నామనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గిల్ నెమ్మదిగా ఆడాలని అన్నాడు. ప్రతి బాల్ ని ఫ్లిక్ చేయాలనే దృష్టితో ఆడుతున్నాడని అన్నాడు. టెస్ట్ మ్యాచ్ అనేది దూకుడుగా ఆడే ఆట కాదని అన్నాడు. టీ20, వన్డే ఫార్మాట్‌లతో పోలిస్తే టెస్టు ఫార్మాట్ పూర్తి భిన్నమని అన్నాడు. అవి ఎక్స్ ప్రెస్ టైప్ లో ఆడితే, ఇక్కడ పాసింజర్ లా ఆడాల్సి ఉంటుందని అన్నాడు.

వికెట్టు కాపాడుకుంటూ ఎన్ని బాల్స్ ఆడామన్నది మన అనుభవానికి నిదర్శనమని, మన ఓపికకు పరీక్షని తెలిపాడు. వైట్ బాల్ కంటే.. టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడే రెడ్ బాల్ గాలిలో కాస్త ఎక్కువగా కదులుతుంది. బౌన్స్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అది మైండ్‌లో ఉంచుకొని బ్యాటర్లు ఆడాల్సి ఉంటుందని అన్నాడు.

Advertisement

సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా గిల్ ఆట తీరుపై స్పందించాడు. దేశవాళీ క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ భారీగా పరుగులు సాధిస్తున్నారని అన్నాడు. వీరు గిల్ ప్లేస్ కోసం కాచుకుని కూర్చున్నారని, వీరే తనకి బలమైన పోటీదారులని అన్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని గిల్ రెండో టెస్ట్ ఆడాల్సి ఉంటుందని అన్నాడు. 

టెస్ట్ మ్యాచ్ లో సగటు 30కి అటుఇటుగా ఉంటే జట్టు మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతుందని హెచ్చరించాడు. మొత్తానికి గిల్ గొప్ప ఆటగాడు కావడంతోనే అందరూ ప్రేమతో చెబుతున్నారనే సంగతి తను గ్రహించాలని సీనియర్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

Big Stories

Advertisement
×