BigTV English
Advertisement

Pooja Hegde: ఆ కారణంగా మరో భారీ చిత్రాన్ని మిస్ చేసుకున్న బుట్టబొమ్మ..?

Pooja Hegde: ఆ కారణంగా మరో భారీ చిత్రాన్ని మిస్ చేసుకున్న బుట్టబొమ్మ..?

Pooja Hegde: టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డేకు తాజాగా ఓ భారీ ఆఫర్ వచ్చినట్టే వచ్చి.. చేజారిపోయింది. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి చేతికి వచ్చిన ఆఫర్‌ను పూజా చేజార్చుకుంది. అయితే మరి ఆ భారీ ఆఫర్ ఎవరు ఇచ్చారు? ఆమె ఎంత డిమాండ్ చేసింది? అన్న విషయానికొస్తే..


టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రమూ బాగాలేదు. ఆమె గత కొంతకాలంగా నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచాయి. ఇక తన లక్ పరీక్షించుకోవడం కోసం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. ఏ ప్రయోజనమూ లేకపోయింది. ముందుగా ‘ఆచార్య’ సినిమాతో పూజా బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’, బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లో నటించినా ఈ అమ్మడుకి ఎక్కడా కలిసిరాలేదు. ఇలా వరుస డిజాస్టర్లు అందుకున్న తర్వాత ఆమెకున్న క్రేజ్ పడిపోతూ వచ్చింది.

అయితే ఈ ముద్దుగుమ్మ ఫామ్ కోల్పోయినప్పటికీ.. ఓ పెద్ద చిత్రం తన వద్దకు వచ్చిందని.. అయితే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి.. ఆ సినిమాను పూజా వదులుకుందని ఓ న్యూస్ బయటకొచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో ‘మిస్టర్ బచ్చన్’ అనే మూవీ రూపొందుతుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజ హెగ్డేను మేకర్స్ తీసుకోవాలనుకున్నారట.


దీంతో ఆమెను సంప్రదించగా.. ఆమె అడిగిన పారితోషికం విని ఒక్కసారిగా షాక్ అయ్యారట. పూజా ఈ మూవీలో నటించడానికి దాదాపు రూ.3 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో మేకర్స్ ఆమెను పక్కన పెట్టేసి.. మరో హీరోయిన్‌ కోసం వెతుక్కున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×