Big Stories

Fire Accident: ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

Fire Accident: రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చిలరేగాయి. పరిశ్రమలో మొత్తం 300 మంది పనిచేస్తుండగా ప్రమాదం నుంచి 150 మంది బయటకు వచ్చారు. మంటలు భారీగా చెలరేగడంతో మిగతా 150 మంది బయటకు రాలేని స్థితిలో పరిశ్రమలోనే ఉండిపోయి ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు.

- Advertisement -

భారీగా మంటలు ఎగసి పడడంతో.. పొగ దట్టంగా అలుముకుంది. మంటల నుంచి బయటపడేందుకు.. లోపలున్న కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కిటికీల నుంచి కిందకు దూకేస్తున్నారు. అటు.. అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలోకి దిగారు. కార్మికుల్ని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సహాయక సిబ్బంది.. నిచ్చెనలు ద్వారా కిటికీలోంచి కార్మికులను బయటకు తీస్తున్నారు.

- Advertisement -

వెల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవాశాత్తు మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పొగ ధాటికి కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది సరవేగంగా సహాయక చర్యలు చేపడుతూ.. ఒక్కొక్కరిని బయటకు తీసుకువస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

50 మందిని కాపాడిన సూపర్ హీరో..
ఈ ప్రమాదంలో జరిగే సమయంలో దగ్గర్లోనే ఉన్న సాయిచరణ్ అనే బాబు మంటలను గమనించాడు. వెంటనే భవనంపైకి ఎక్కి ఓ తాడును కిందకు వదిలాడు. సాయిచరణ్ కట్టిన తాడు సహాయంతోనే బిల్డింగ్ లోని కార్మికులు బయటకు రాగలిగారు. లేదంటే వారంతా సజీవదహనమయ్యేవారు. దీంతో సాయిచరణ్ సమయస్ఫూర్తికి అందరూ మొచ్చుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News