SRH Team : హైదరాబాద్ పరిధిలోని నల్లగండ్లలో పలువురు క్రికెటర్లు సందడి చేశారు. శుక్రవారం అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన టీబీసీ సెలూన్ ప్రారంభోత్సవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెటర్లు హాజరయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హెయిర్ సెలూన్ నల్లగండ్లలో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించగా.. సన్‌రైజర్స్ ఆటగాడు నితీశ్ రెడ్డి, ఆస్ట్రేలియాకి చెందిన పలువురు క్రికెటర్లు హెడ్, మార్కస్ స్టాయినిస్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు, సినీ నటులు అక్కడకు వెళ్లి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ 2025ను విజయంతో ప్రారంభించింది. కానీ ఆ తరువాత వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండటం విశేషం. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 286 పరుగుల భారీ స్కోర్ సన్ రైజర్స్ ఆ తరువాత పేలవ ప్రదర్శన చేస్తోంది. 300 పరుగులు చేస్తుందనుకున్న అభిమానుల ఆశలను అస్సలు 100 పరుగులు అయినా చేస్తుందా..? అనేలా ఆడుతున్నారు బ్యాటర్లు. ముఖ్యంగా ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ విఫలం చెందుతున్నారు. దీంతో SRH భారీ స్కోర్ చేయలేకపోతుంది. దీనికి తోడు బౌలింగ్ కూడా చెత్తగా ఉండటంతో SRH విజయం సాధించడం చాలా కష్టంగా మారుతుంది. కీలక బౌలర్లను వదులుకోవడంతో SRHకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు.
ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలు చెందడంతో ఆ జట్టు విజయం సాధిస్తుందనే ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్నదని చెప్పవచ్చు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడితే కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లోనే ఘన విజయం సాధించి ఆ తరువాత 4 మ్యాచ్ లలో ఓడిపోయింది. వరుస ఓటములతో ఎస్ఆర్హెచ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వీరి బ్యాటింగ్ లో పదును తగ్గింది. గత సీజన్ లో మాదిరిగా ఈ సీజన్ లో ప్రదర్శన చేయలేకపోతుంది. ముఖ్యంగా అభిమానులు ఆశలు పెట్టుకున్నటువంటి ట్రావిస్ హెడ్, హెన్నిచ్ క్లాసెన్ భారీ ఇన్నింగ్స్ అస్సలు ఆడటం లేదు. ప్రారంభాలు లభిస్తున్నప్పటికీ వాటిని భారీ ఇన్నింగ్స్ లుగా మార్చలేకపోతున్నారు. ఈ సమస్య తీరాలంటే హెన్రిచ్ క్లాసెన్ ఆర్డర్ ను మార్చాల్సి ఉందని అభిమానులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం క్లాసెన్ 5వ నెంబర్ లో వస్తున్నాడు. వాస్తవానికి క్లాసెన్ రావడంతోనే భారీ షాట్స్ ఆడే ప్లేయర్ కాదు. కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకొని ఆ తరువాత దూకుడుగా ఆడుతుంటాడు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయగల సత్తా గల బ్యాటర్ క్లాసెన్. క్లాసెన్ 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ కి పంపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని.. ఓవర్లు ఎక్కువగా ఉండటంతో ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా.. ఆ తరువాత భారీ షాట్స్ ఆడుతాడని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ ఇద్దరూ కూడా ఫామ్ లో లేరు. క్లాసెన్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో పైకి పంపి.. అతని ఆటకు కూడా పరీక్షిస్తే బెటర్ అని SRH అభిమానులు పేర్కొంటున్నారు. ఈనెల 12 న SRH పంజాబ్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది.
నల్లగండ్లలో సందడి చేసిన క్రికెటర్లు, నటులు
నూతనంగా ఏర్పాటు చేసిన టీబీసీ సెలూన్ ప్రారంభోత్సవానికి హాజరై సందడి చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెటర్లు
నల్లగండ్లలో నూతన బ్రాంచ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హెయిర్ సెలూన్
సన్‌రైజర్స్ ఆటగాడు నితీశ్ రెడ్డి,… pic.twitter.com/O3TV3Ae0eZ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 11, 2025