BigTV English

Sunrisers playoff chances : సన్ రైజర్స్ ఇంటికే ఇక.. ఈ 3 కారణాలతో ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే

Sunrisers playoff chances : సన్ రైజర్స్ ఇంటికే ఇక.. ఈ 3 కారణాలతో ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే
srh

Sunrisers playoff chances : సన్ రైజర్స్ ఆట చూసి మండిపడుతున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. హ్యాట్రిక్ ఓటమి చూశాక.. ఇక ఈ టీమ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లడం కష్టమేనని ఆశలు వదులుకున్నారు. మరీ దారుణంగా గెలిచే మ్యాచ్ ను చేజేతులా ఓటగొట్టుకున్నారు. పైగా వచ్చే మ్యాచ్ లు మామూలువి కావు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, రాజస్తాన్ రాయల్స్ తో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే… మూడు కారణాలతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లదని చెబుతున్నారు.


1. ఫామ్ లేని ప్లేయర్లు
ఏదో ఒక్క మ్యాచ్‌లో తప్ప హైదరాబాద్ బ్యాట్స్ మెన్ నుంచి మెరుపులే లేవు. గొప్పగా ఆడతారనుకున్న ఆటగాళ్లంతా ఫామ్ కోల్పోయారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠిపై గంపెడు ఆశలు పెట్టుకుంటే ఈ ముగ్గురూ నీరుగార్చేశారు. ఇప్పటి వరకు అభిషేక్ శర్మ కూడా స్థాయికి తగ్గట్టు ఆడలేదు. బౌలింగ్ కూడా గొప్పగా ఏం లేదు. మార్కో జాన్సెస్, ఉమ్రాన్ మాలిక్ ఫెయిల్. వీళ్లు ఇలాగే ఆడితే ఇక ప్లే ఆఫ్స్ కు వెళ్లినట్టే.

2. దారుణమైన రన్ రేట్
పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకున్నా.. రన్ రేటులో వచ్చిన పెద్ద పాజిటివిటీ ఏం లేదు. ఎందుకంటే, రాజస్తాన్ రాయల్స్ తో 72 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. లక్నోతోనూ అలాగే జరిగింది. అదృష్టం బాగుండి వరుస మ్యాచ్ లు గెలిచినా… రన్ రేట్ కారణంగానే టాప్-4లోకి వెళ్లే అవసరం ఏర్పడవచ్చు. సో, రన్ రేట్ బాగుండాలంటే.. హైదరాబాద్ మామూలుగా గెలవడం కాదు.. అద్భుతంగా గెలవాలి. ఇప్పుడున్న టమ్ తో అది సాధ్యమేనా.


3. టేబుల్ లో విపరీతమైన పోటీ
ప్లే ఆఫ్స్ కు వెళ్లేది నాలుగు జట్లే. ప్రస్తుత టేబుల్ చూస్తే భారీ పోటీ కనిపిస్తోంది. కోల్ కతా, ఢిల్లీ జట్లు గట్టిగా పోటీ పడుతున్నాయి. పైగా హైదరాబాద్ కంటే ఎక్కువ మ్యాచ్ లు గెలిచి, మంచి రన్ రేట్‌తో ఉన్న జట్లు కూడా ఉన్నాయి. సో, వాటన్నింటినీ దాటుకొని నాలుగో స్థానంలోకి వెళ్లాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో అద్భుతమే జరగాలి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×