
Ponniyan Selvan-2 : పొన్నియన్ సెల్వన్-2 సినిమాను ఎలా అమ్ముకోవాలో మణిరత్నంకు తెలియడం లేదు. తమిళంలో తప్ప ఏ ఒక్క భాషలో కూడా సరిగా ఆడలేదు. తెలుగులో 10 కోట్లు పెట్టి ఫస్ట్ పార్ట్ కొన్నా… దానికి తగ్గ లాభాలు రాలేదు. పైగా సెకండ్ పార్ట్ చూడాలన్న ఇంట్రస్ట్ కూడా క్రియేట్ చేయలేదు. అలాంటప్పుడు పొన్నియన్ సెల్వన్-2 ఎలా కొంటారు. అందుకే, మొన్న హైదరాబాద్ వచ్చిన టీమ్.. తెలుగు ప్రజలు సూపర్ అంటూ పొగిడి వెళ్లిపోయారు.
ఇదంతా పక్కన పెడితే… పొన్నియన్ సెల్వన్-2 రన్ టైమ్ 4 గంటలు అంటున్నారు. చెత్తా చెదారం, కట్ షాట్స్ అన్నీ తీసేయగా… మిగిలిన ఫీడ్ నాలుగు గంటలు వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆ 4 గంటలనే లాక్ చేశారట. దాన్ని మూడు గంటలకు కుదించడమే పెద్ద సవాల్. నిజానికి తమిళంలో మూడు గంటలు అంటే చూస్తారు. కాని, మిగతా భాషల్లో 3 గంటలు చూడ్డం అంటే నరకమే. సో, కనీసం రెండున్నర గంటలకు కుదించాలి. అప్పుడే కొద్దోగొప్పో జనం థియేటర్లకు వస్తారు. కాని, 4 గంటల ఫీడ్‌లో గంటన్నర కోసేయడం సాధ్యమేనా? అలా చేస్తే స్టోరీ మొత్తం చెడిపోదా. అసలే ఫస్ట్ పార్ట్ ఎవరికీ అర్థం కాలేదు. బాహుబలిలో మహేంద్ర బాహుబలి, భళ్లాలదేవ, కట్టప్ప లాంటి పేర్లు ఇప్పటికీ రిజిస్టర్ అయ్యాయి. కాని, పొన్నియన్ సెల్వన్‌లో పట్టుమని మూడు క్యారెక్టర్ల పేర్లు కూడా చెప్పలేరు తెలుగు ప్రేక్షకులు. అలాంటప్పుడు… గంటన్నర పార్ట్ కోసేస్తే… అర్థం అవుతుందా?
పొన్నియన్ సెల్వన్-2 సినిమాను బయ్యర్లు కొనకపోవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు. 4 గంటలు ఉంటే మాత్రం కొనడం కష్టం అనేస్తున్నారు. పోనీ మీ కోసం గంటన్నర తీసేస్తామంటే… అర్థం పోతుంది కదా కొనం అంటున్నారు. ఎటొచ్చినా పేచీనే కనిపిస్తోంది. పైగా ఫస్ట్ పార్ట్ మొత్తం ఇంట్రడక్షన్‌కే సరిపోయింది. రెండో పార్ట్‌లోనే అసలు కథ ఉంది. ఇందులో కోతలు పెడితే ఎలా అనేది ఓ వర్షన్.
మొత్తానికి పొన్నియన్ సెల్వన్ విషయంలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం పెద్ద పొరపాటే చేసినట్టు కనిపిస్తోంది. పాత్రల పరిచయంతో పాటు ఏం జరిగిందన్న విషయాన్ని స్క్రీన్ ప్లే మ్యాజిక్‌లో అక్కడక్కడ చూపించి ఉంటే బాగుండేదంటున్నారు. చూడాలి మరి చివరికి ఏమవుతుందో.