Big Stories

Sachin love story: సచిన్‌కు బర్త్ డే విషెస్, లవ్ స్టోరీ లోతుల్లోకి వెళ్తే..

Sachin love story: క్రీడా ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేని పేరు. ఆయన ఎవరో తెలుసా? టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. తక్కువ సమయంలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. సరిగ్గా ఇవాళ అంటే (బుధవారం) ఏప్రిల్ 24న పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు ప్రత్యేకంగా మీకోసం.. ఐదుపదుల వయస్సు దాటిన మాజీ ఆటగాడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు కోట్లాది మంది అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. వారిలో సచిన్ వైఫ్ డాక్టర్ అంజలి కూడా ఒకరు.

- Advertisement -

1990 ఏడాది మధ్యాహ్నం.. ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య.. ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని ఇండియాలో అడుగుపెట్టారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సరిగ్గా యువ ఆటగాడు వయస్సు 17 ఏళ్లు. అదే సమయంలో డాక్టర్ అంజలి కూడా తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడే డాక్టరమ్మని చూసి మనసు పారేసుకున్నాడు సచిన్. అయితే ఆమెని మరోసారి చూడాలని తహతహలాడేవాడు. కానీ సమయం, సందర్భం రాలేదు. సంకల్ప బలంగా గట్టిగా ఉంటే ఏదైనా జరుగుతుందని అంటారు.. సచిన్ విషయంలోనూ అదే జరిగింది. ఓ పార్టీలో ఫ్రెండ్స్ ద్వారా సచిన్-డాక్టర్ అంజలికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారి తీసింది.

- Advertisement -

పరిచయం నుంచి పెళ్లి వరకు జరిగిన సంగతులను ఒకసారి గుర్తుచేద్దాం. సచిన్‌‌కి డాక్టర్ అంజలి అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం. కానీ అంజలికి తన ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్లేవారు. అయితే సచిన్ అప్పటికే పాపులర్. ప్రేక్షకులు గుర్తు పట్టకుండా ఉండేందుకు థియేటర్‌కి లేటుగా వెళ్లేవాడు. మరో ఐదునిమిషాలు ఆట ముగుస్తుందనగా బయటకు వచ్చేసేవాడు.

అయితే తొలిసారి అంజలిని ఇంటికి తీసుకెళ్లినప్పుడు జర్నలిస్టుగా ఫ్యామిలీ సభ్యులకు పరిచయం చేశాడు మాస్టర్ బ్లాస్టర్. సల్వార్ కమీజ్ ధరించి మొదటిసారి సచిన్ ఇంటికి వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ అంజలి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడటానికి ఆమె టెలిఫోన్ బూత్‌కి వెళ్లేంది అంజలి. బిల్లు కూడా ఎక్కడ రావడంతో చివరకు లేఖలు రాసుకునేవారు. చివరకు ఐదేళ్ల తర్వాత సచిన్-అంజలి జంట 1995 మే 24న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు కుమారుడు, కూతురు. కొడుకు పేరు అర్జున్.. గతేడాది ఐపీఎల్‌లో ముంబై తరపున ఆడాడు. కూతురు సారా టెండూల్కర్ ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్లింది.

ALSO READ: ఢిల్లీ రాజు ఎవరు? నేడు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్

మరోవైపు సచిన్ పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ స్పెష‌ల్‌గా విషెస్ చెప్పింది. సచిన్ జీవితంలో సాధించిన రికార్డులను గుర్తు చేసింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News