BigTV English

Surya Kumar Yadav : అది ఓడిపోయే మ్యాచే.. సూర్యకుమార్

Surya Kumar Yadav : అది ఓడిపోయే మ్యాచే.. సూర్యకుమార్
Surya Kumar Yadav

Surya Kumar Yadav : ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అది ఓడిపోయే మ్యాచ్ అని తెలిపాడు. కాకపోతే టీమిండియా కుర్రాళ్లకి ఒకటే చెప్పాను. మీరు గెలుపు- ఓటములు అనేవి మీ మనసులోకి రానివ్వద్దు. మీరెంతవరకు బెస్ట్ ఇస్తారో అంతే ఇవ్వండి, నిర్భయంగా ఆడదామని చెప్పానని అన్నాడు. అలాగే మిడిల్‌లో ఉన్నా ఆటను ఆస్వాదిస్తూ ఆడాలని చెప్పానని కూడా అన్నాడు.


పిచ్ మందకొడిగా ఉందనే సంగతి ముందే గ్రహించామని అన్నాడు. ఇక్కడ 180 పరుగులు చేసినా గెలవడం సాధ్యమేనని తెలిపానని అన్నాడు. కాకపోతే టాస్ ఓటమి చిన్న ఇబ్బంది పెట్టిందని అన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 10 ఓవర్లు గడిచిన తర్వాత టీమ్ అందరితో ఒకటే మాట చెప్పానని అన్నాడు. మనం ఈ మ్యాచ్ గెలవబోతున్నాం, ఏ అవకాశాన్ని వదిలిపెట్టవద్దు, అప్రమత్తంగా ఉండమని చెప్పానని అన్నాడు.

తర్వాత సరిగ్గా 16 ఓవర్ లో మ్యాట్ షార్ట్ కొట్టిన షాట్ ని రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అది మరిచిపోలేనని అన్నాడు. అదే మ్యాచ్ కి టర్నింగ్ అని కూడా చెప్పాడు. ఇలాంటి ఇంట్రస్టింగ్ థింగ్స్ మ్యాచ్ లో చాలా జరిగాయని అన్నాడు.


అంతవరకు ఎక్సెపెన్సివ్ బౌలర్ గా ఉన్న ముఖేష్ కుమార్ అద్భుతంగా లయ అందుకున్నాడు. అదే 16 ఓవర్ లో రుతురాజ్ క్యాచ్ పట్టిన వెంటనే ముఖేష్ కుమార్ మరో వికెట్ తీసి బ్రేక్ త్రూ ఇచ్చాడని తెలిపాడు. దాంతో కంప్లీట్ మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చిందని అన్నాడు. కాకపోతే చివరి ఓవర్ 10 పరుగులు మాత్రమే చేయాలి. అవతలి వైపున ప్రమాదకరమైన వేడ్ ఉన్నాడు.

ఆ సమయంలో అర్షదీప్ పై నమ్మకం ఉంచాను. ఇంతవరకు జరిగిన మ్యాచ్ ఒక లెక్క, అర్షదీప్ ఆఖరి ఓవర్ ఒక లెక్క అన్నట్టు అయిపోయిందని అన్నాడు. మొత్తానికి సిరీస్ ని ఘనంగా ముగించామని ఆనందంగా తెలిపాడు. అయితే వాషింగ్టన్ సుందర్ ఉండి ఉంటే ఈ మ్యాచ్‌ మరింత సులువయ్యేదని అన్నాడు. టీమ్ కాంబినేషన్ లో అతనికి అవకాశం రాలేదని తెలిపాడు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×