BigTV English

Eagle First Single : సింగిల్ ప్రోమోతో సోషల్ మీడియా షేక్.. ఆడు మచ్చా అంటున్న మాస్ మహారాజ్..

Eagle First Single :  సింగిల్ ప్రోమోతో సోషల్ మీడియా షేక్.. ఆడు మచ్చా అంటున్న మాస్ మహారాజ్..
Eagle First Single

Eagle First Single : మాస్ మహారాజా సంక్రాంతి బరిలోకి దిగబోతున్న నెక్స్ట్ మూవీ ఈగల్. మంచి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కార్తీక్ ఘట్టమనేని వహిస్తున్నాదు. ఈ మూవీ నుంచి ఇదివరకే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. 2024 సంక్రాంతి సంబరాలను మరింత పెంచడానికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో.. ప్రమోషన్స్ పై చిత్ర బృందం జోరు పెంచింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఆడు మచ్చ.. అంటూ సరే ఊర మాస్ పాటను ఈ చిత్రం నుంచి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ను కూడా రీసెంట్గా యూట్యూబ్లో విడుదల చేశారు. దీనితో పాటుగా రవితేజకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ని అతని అభిమానులకు కానుకగా విడుదల చేశారు.

ఈ పోస్టర్లో మాస్ మహారాజ్ సరికొత్త అవతారం చూసి ఫాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా మాస్ మహారాజ్ మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేసిందే లేదు అని కూడా అంటున్నారు. ఫుల్లు గడ్డం పెంచుకొని లాంగ్ హెయిర్ తో ..లుంగీలో ఊర మాస్ గా ఉన్న రవితేజ ను చాలా పవర్ ఫుల్ గా ఉంది. మరొక ఒక సాంగ్ లో కూడా అదిరిపోయే స్టెప్పులతో రవితేజ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది. వెనక బ్యాగ్రౌండ్ లో కాళికామాత విగ్రహం.. చుట్టూ ఉన్న జనాల గెటప్ చూస్తే ఏదో జాతరకు సంబంధించిన సీక్వెన్స్ లో ఈ పాట సాగుతుందని అర్థమవుతుంది.


ఇక థియేటర్లో ఈ పాటకు.. బాక్స్ బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు రవితేజ అభిమానులు.దేవ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా ఆలపించాడు. ఈరోజు దీనికి సంబంధించిన ప్రోమో ని మాత్రమే విడుదల చేశారు ఇక ఫుల్ సాంగ్ డిసెంబర్ 5న 6 గంటలకు యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తారు.

యూట్యూబ్లో విడుదల చేసిన ఒక చిన్న ప్రోమో ఇంపాక్ట్ భయంకరంగా కనిపిస్తోంది.. మరి ఫుల్ సాంగ్ విడుదలయితే చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. గత రెండు సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చిన రవితేజ ఈ చిత్రంపై కొండంత ఆశ పెట్టుకుని ఉన్నాడు.ఈసారైనా అతను అనుకున్నది సాధిస్తాడు అని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×