EPAPER

Surya Kumar Yadav : నా జీవితంలో ఒక క్యాచ్ పట్టా, అదే గ్రేట్ : సూర్య

Surya Kumar Yadav : నా జీవితంలో ఒక క్యాచ్ పట్టా, అదే గ్రేట్ : సూర్య

Surya kumar yadav latest news(Sports news headlines): ఇదేమిటి? టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో పట్టిన క్యాచ్ కదా గ్రేట్? సూర్యా ఏమిటి అంతకుమించి గొప్ప క్యాచ్ ముందే పట్టేశాను అంటున్నాడు. ఇంతకీ అదేం క్యాచ్, ఏ మ్యాచ్ అది ? అని నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టి మ్యాచ్ ని మలుపుతిప్పిన హీరోగా సూర్యకుమార్ యాదవ్ ని ప్రపంచమంతా ఇప్పటికి కీర్తిస్తోంది.


చాలామంది సీనియర్ క్రికెటర్లు, కామెంటేటర్లు కూడా తమ జీవితకాలంలో ఒక ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ హై ఓల్టేజ్ మ్యాచ్ లో ఇంత గొప్ప క్యాచ్ పట్టడం చూడలేదని సూర్యాని ఆకాశానికెత్తేశారు. అంతేకాదు ఇది క్రికెట్ చరిత్రలోనే ఒక గొప్పక్యాచ్ గా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

అయితే సూర్యా మాత్రం అదేం గొప్ప క్యాచ్ అంటున్నాడు. దానికన్నా గొప్ప క్యాచ్ ఎనిమిదేళ్ల క్రితం పట్టానని తెలిపాడు. అదే నా జీవితంలో ఏకైక గొప్ప క్యాచ్ అన్నాడు. మళ్లీ అందరూ ఆశ్చర్యపోయారు.


Also Read : కప్ గెలిచినందుకు ఎక్స్‌ట్రా మనీ వద్దు.. దటీజ్ రాహుల్ ద్రావిడ్

ఇంతకీ విషయం ఏమిటంటే.. సూర్యకుమార్ కి పెళ్లయ్యి ఎనిమిదేళ్లవుతోంది. జులై 7, 2016లో దేవిశా శెట్టితో వివాహమైంది. ఇటీవల వారు వివాహ వార్షికోత్సవం చేసుకున్నారు. ఆ చిత్రాలను సూర్య సోషల్ మీడియాలో పెట్టి, దానికింద ఒక క్యాప్షన్ రాశాడు. అదే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

‘డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టి నేటికి ఎనిమిది రోజులు అవుతోంది. కానీ నా లైఫ్ లో ఎనిమిదేళ్ల క్రితం.. ఒక కాలేజీ వార్షికోత్సవంలో ఒకమ్మాయిని క్యాచ్ పట్టాను. అదే నా జీవితంలో ఎప్పటికి గొప్ప క్యాచ్ అన్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు.. తన భార్య దేవిశా శెట్టి అని తెలిపాడు. వాళ్లిద్దరి మొదటి పరిచయాన్ని గుర్తు చేస్తూ, ఆ రోజులు ఇంకా గుర్తున్నాయని అన్నాడు. ఇప్పుడు తను పెట్టిన క్యాప్షన్, ఫొటోలపై నెట్టింట మంచి స్పందన వస్తోంది.

Tags

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×