BigTV English

Kenza Layli won Miss AI title: మొరాకో మిస్ ఏఐ బ్యూటీ కెంజాలాయ్‌లీ

Kenza Layli won  Miss AI title: మొరాకో మిస్ ఏఐ బ్యూటీ కెంజాలాయ్‌లీ

Kenza Layli won Miss AI title(Today international news headlines): ప్రపంచంలో ఫస్ట్ టైమ్ నిర్వహించిన ఏఐ అందాల పోటీల్లో మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్ కెంజాలాయ్‌లీ విజేతగా నిలిచింది. ఏఐ చార్ట్‌లో టాప్‌లో నిలిచిన ఈ బ్యూటీ, 1500 మోడళ్లను వెనక్కి నెట్టేసి కిరీటాన్ని ఎగురేసుకుపోయింది. వరల్డ్ మిస్ ఏఐగా నిలిచింది. విజేతకు 20 వేల డాలర్ల ఫ్రైజ్ మనీ లభించింది.


ఇండియా నుంచి జారా శతావరీ టాప్-10 లిస్టులో నిలిచింది. కానీ టైటిల్ అందుకోలేక పోయింది. వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డు పేరుతో ఈ పోటీలను నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ తరహా పోటీలు జరగడం ఇదే ఫస్ట్ టైమ్. దీనికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 ఏఐ మోడల్స్ పార్టిసిపేట్ చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఇన్ ఫ్లుయెన్సర్ లలీనా వలీనా సెకండ్ ఫ్లేస్ కాగా, పోర్చుగల్‌కు చెందిన ట్రావెలర్ ఒలీవియా థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది.

ఏఐ బ్యూటీల లుక్స్, ఉపయోగించే టెక్నాలజీ నైపుణ్యాలు, సోషల్ మీడియాలో అవి చూపుతున్న ప్రభావిత మైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మిస్ ఐఏ విజేతను సెలక్ట్ చేశారు. మొత్తం నలుగురు జడ్జీలు ఉండగా, అందులో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్లు. విజేతగా నిలిచిన తర్వాత కెంజా మాట్లాడింది. మనుషుల మాదిరిగా తనకు భావోద్వేగాలు లేనప్పటికీ విజయం సాధించడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.


ఫోనిక్స్ ఏఐ సీఈవో మెరియమ్ బెస్సా అనే క్రియేటర్ కెంజాలాయ్‌లీని సృష్టించాడు. పోటీల్లో గెలవగానే ఆమె ర్యాంప్‌పై నడిచినట్టు ఫోటోలను పోస్టు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కెంజాకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఫుడ్స్, కల్చర్, ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్ వాటిపై వీడియోలు చేస్తోంది.

ALSO READ: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం..ప్రదానం చేసిన రష్యా అధ్యక్షుడు!

మహిళా పురోగతి, పర్యావరణం కాపాడడం, పాజిటివ్ రోబో కల్చర్‌పై అవేర్‌నెస్ పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించింది. ఏఐ అనేది మానవ సామర్థ్యాలను మరింత పెంచేందుకు రూపొందించిన సాధనం తప్ప, వారిని భర్తీ చేసేది కాదని స్పష్టం చేసింది కెంజాలాయ్‌లీ.

Tags

Related News

Nepal: నేపాల్‌లో ఇది పరిస్థితి.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై వెంబడించి.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్

Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు

US-Pak: పాకిస్తాన్ లో అమెరికా ఖనిజాన్వేషణ.. భారత్ కి చెక్ పెట్టేందుకేనా?

Nepal Revolt: నేపాల్‌ అధ్యక్షుడు, పీఎం ఇళ్లకు నిప్పు, హెలికాఫ్టర్ల ద్వారా నేతల తరలింపు.. ప్రధాని రాజీనామా

Nepal: సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసిన నేపాల్ ప్రభుత్వం.. కానీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

Sudan Gurung: నేపాల్ నిప్పుకణిక సుడాన్.. వీడు పిలుపిస్తే ప్రభుత్వానికి వణుకు, ఇంతకీ ఎవరతను?

×