BigTV English

Suryakumar : సూర్య సూపర్ ఫామ్‌కు కారణాలేంటి?

Suryakumar : సూర్య సూపర్ ఫామ్‌కు కారణాలేంటి?

Suryakumar : పిచ్ ఎలాంటిదైనా సరే.. ప్రత్యర్థి ఎంతటి సమర్థుడైనా సరే.. సూర్య మాత్రం చితగ్గొట్టేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయి ఆడుతున్నాడు. T20 వరల్డ్ కప్ జరిగిన ఆస్ట్రేలియా పిచ్‌ల మీదే కాదు… న్యూజిలాండ్ పిచ్‌ల మీద కూడా సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుండటంతో… అతనికి ఎలా బంతులు వేయాలో ప్రత్యర్థి బౌలర్లకు అర్థం కావడం లేదు. సూర్య అద్భుత బ్యాటింగ్ వెనుక అంతులేని కఠోర శ్రమ ఉంది. అదే అతణ్ని ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో హీరోను చేసింది.


ఫాస్ట్‌ పిచ్‌ల మీద ఆడాలంటే భారత బ్యాటర్లకు వణుకు అనే అపవాదును తుడిచిపెట్టి… పూర్తిగా పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పిచ్‌ల మీద సూర్య చెలరేగి ఆడటానికి ఓ కారణం ఉంది. ముంబైలోని పార్సీ జింఖానా మైదానంలో ప్రాక్టీస్ చేసే సూర్య… అక్కడ పచ్చికతో కూడిన పేస్‌ బౌలింగ్‌ పిచ్‌ను చేయించుకుని మరీ సాధన చేస్తాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కఠినమైన పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టే… ఎలాంటి పిచ్ మీద అయినా సూర్య అద్భుతంగా ఆడగలుగుతున్నాడు.

సాధనలో భాగంగా ఫాస్ట్ బౌలర్లతోనే కాదు… మీడియం పేసర్లు, స్పిన్నర్లతోనూ బౌలింగ్ చేయించుకుంటాడు… సూర్య. అందుకే అతడు ప్రాక్టీస్ కోసం బయలుదేరాడని తెలియగానే… పార్సీ జింఖానా మైదానంలో బౌలింగ్ బృందం సిద్ధమైపోతుంది. అందులో లెఫ్టార్మ్‌, రైటార్మ్‌ పేసర్లు, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌, లెఫ్టార్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌, ఆఫ్‌ స్పిన్నర్‌, లెగ్‌ స్పిన్నర్‌, సైడ్‌ ఆర్మ్‌ త్రో బౌలర్‌ కూడా ఉంటారు. వాళ్లు విసిరే ప్రతీ బంతిని ఎన్ని విధాలుగా కొట్టొచ్చు అనేది వారితోనే చర్చిస్తాడు… సూర్య. అందరూ విసిరే వైవిధ్యమైన బంతులు ఎదుర్కోవడంలో ఆరితేరిపోయాడు కాబట్టే… అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సూర్య ఊచకోత కోస్తున్నాడు. అంతేకాదు… బరిలోకి దిగే ముందే ఎలాంటి బౌలర్లను ఎదుర్కోబోతున్నాననే దానిపై సూర్య ఓ క్లారిటీకి వస్తాడు. బౌలర్‌ బంతిని విసరక ముందే… ఫీల్డింగ్‌ను బట్టి ఎలా ఆడాలో మనసులో ప్లాన్‌ సిద్ధం చేసుకుంటాడు. దాని ఫలితమే… ఇప్పుడు మనం చూస్తున్న సూర్య బ్యాటింగ్ విన్యాసాలు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×