BigTV English

Suryakumar Yadav: అదే వ్యూహంతో ఆసిస్‌ను దెబ్బ కొట్టాం : సూర్యకుమార్

Suryakumar Yadav: అదే వ్యూహంతో ఆసిస్‌ను దెబ్బ కొట్టాం : సూర్యకుమార్
Suryakumar Yadav

Suryakumar Yadav : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ విజయం సాధించిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. మేం ఒకటే అనుకున్నాం. అదే వ్యూహంతో బౌలింగ్ చేశాం. విజయం సాధించామని తెలిపాడు. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటో వివరించాడు.


మూడో టీ 20 మ్యాచ్ లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయలేక మ్యాచ్ ని కాపాడుకోలేక పోయాం. అక్కడ ప్రాబ్లం ఏమిటో తెలిసింది. కొండంత లక్ష్యం కూడా ఒక ప్రణాళిక లేకుండా బౌలింగ్ చేయడం వల్ల మ్యాక్స్ వెల్, వేడ్ కలిసి తుత్తు నియలు చేశాడని తెలిపారు. మళ్లీ అదే పొరపాటు రిపీట్ కాకూడదని భావించాం.

అందుకే డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించాలని బౌలర్లకు దిశా నిర్దేశం చేశాం. మ్యాచ్ తర్వాత దొరికిన విరామంలో బౌలర్లతో ఇవే బాల్స్ పదే పదే ప్రాక్టీస్ చేయించాం. దీంతో వాళ్లు ఎలా వేసినా అది యార్కర్ వచ్చేలా తీర్చిదిద్దాం. ఆ మంత్రం పని చేసిందని తెలిపాడు.


రెండోది రాయ్ పూర్ పిచ్ బౌలింగ్ కి కొంచెం అనుకూలించడం, మన బౌలర్లు చేసిన ప్రాక్టీస్ కారణంగా బాల్ పిచ్ మీద పడి యార్కర్ గా మారి ఇన్ కట్ కావడంతో బ్యాటర్లు ఫ్రీగా బ్యాట్ ఝులిపించ లేకపోయారు. వారికి సింగిల్స్, టూస్ తప్ప మరొకటి రాలేదని వివరించాడు. ఎప్పుడైనా మనవాళ్లు లూజ్ బాల్స్ వేస్తే మాత్రం, దానికి పనిష్మెంట్ లభించిందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

మీ సత్తాను భయటపెడుతూ నిర్భయంగా ఆడమని మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు చెప్పానని తెలిపాడు. అక్షర్ పటేల్‌‌ను ఒత్తిడిలో ఉంచడానికే ఇష్టపడతానని అన్నాడు. ఆ టైమ్ లో తనకి తెలియకుండానే తన బౌలింగ్ లో పదును పెరుగుతుందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ అసాధారణంగా బౌలింగ్ చేశాడని కితాబునిచ్చాడు.

ఒక ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయడం వల్ల, ఒక మోస్తరు టార్గెట్ అయినా సరే, కాపాడుకోగలిగామని సూర్యకుమార్ యాదవ్ సంతోషంగా అన్నాడు. సిరీస్ కూడా రావడం మరీ ఆనందంగా ఉందని అన్నాడు.

తాత్కాలిక కెప్టెన్ అయినప్పటికి సిరీస్ విజయాన్ని, అదే ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై అందించడం పట్ల సూర్యపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో సౌతాఫ్రికా టూర్ కి కూడా టీ 20 సిరీస్ కి సూర్యానే కెప్టెన్ కావడం అందరికీ తెలిసిన విషయమే. ఆల్ ది బెస్ట్ సూర్య అని నెట్టింట పోస్టింగులు తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

IPL 2026: ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. షాక్ లో ప్లేయర్లు… ఇకపై అక్కడ ఒక మ్యాచ్ ఆడాల్సిందే

IND Vs PAK : టీమిండియాతో ఫైన‌ల్‌..ఓపెన‌ర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం 18వ ర్యాంక్ లో ఉండి వణుకు పుట్టించింది

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

Big Stories

×