Suryakumar – Pakistani fan: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఆదివారం రోజున.. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ జరగక… ఈ సందర్భంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలామంది సెలబ్రిటీలు, యంగ్ క్రికెటర్లు, బిజినెస్ మాన్ లు, అలాగే హీరోయిన్లు… అటు పాకిస్తాన్ కు సంబంధించిన సెలబ్రిటీలు…. ఇలా ఎంతోమంది… దుబాయ్ స్టేడియానికి వచ్చారు. దుబాయ్ లో మ్యాచ్ నిర్వహించిన నేపథ్యంలో… మ్యాచ్ చూసేందుకు చాలామంది ఆసక్తి రావడం జరిగింది. ఈ తరుణంలోనే కొన్ని ఆసక్తికర సంఘటనలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే సూర్య కుమార్ యాదవ్ అలాగే పాకిస్తాన్ లేడీ ఫ్యాన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్… ప్రేక్షకుల మధ్య మ్యాచ్ చూస్తున్న నేపథ్యంలో… తన ముందు సీట్లో ఓ లేడీస్ ఫ్యాన్ హల్చల్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ ను చూడగానే…. అతనితో సెల్ఫీలు దిగింది ఆ లేడీ ఫ్యాన్. ఆమె పాకిస్తాన్ జెర్సీ ధరించుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే సెల్ఫీలు అడగగానే సూర్య కుమార్ యాదవ్ కూడా కాదనలేదు. ఆమె ఫోన్ తీసుకొని మరి ఫోటోలు కూడా దించాడు సూర్య కుమార్ యాదవ్. ఆయనతో పాకిస్తాన్ లేడీ కూడా… సూర్య కుమార్ యాదవ్ తో ఫోటోలు దిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి మధ్య సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఎవరో పైన కూర్చున్న వారు తీశారు. నిన్న ఈ సంఘటన జరగగా ఇవాళ వైరల్ అయింది.
ఇది ఇలా ఉండగా… టీమిండియా టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉండేవాడు. కానీ అతనిపై వేటువేసి సూర్య కుమార్ యాదవ్ కు గంభీర్ బాధ్యతలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఇంగ్లాండ్ పైన కూడా సిరీస్ గెలిచాడు సూర్య కుమార్ యాదవ్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… దుబాయ్ లో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్లో రోహిత్ శర్మ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది.
పాకిస్తాన్ జట్టు పైన ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ శర్మ సేన. ఈ మ్యాచ్ లో గిల్, శ్రేయస్ అయ్యర్ అలాగే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారు. గత కొన్ని రోజులుగా ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ కూడా… ఫామ్ లోకి వచ్చి అదరగొట్టాడు. రెండు పరుగులు చేస్తే టీమిండియా గెలుస్తుంది అన్న సమయంలో… ఫోర్ కొట్టి సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో తన కెరీర్ లో 82 సెంచరీల మార్కును అందుకున్నాడు. అలాగే ఇదే మ్యాచ్లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా రెండవ క్రికెటర్ గా రికార్డులోకి ఎక్కాడు విరాట్ కోహ్లీ.
Suryakumar Yadav poses with a Pakistani fan 🇵🇰🇮🇳♥️#INDvsPAK #ChampionsTrophy2025 pic.twitter.com/CUHBhOjWM3
— Ahtasham Riaz (@ahtashamriaz22) February 23, 2025