MLC Kavitha: మహబూబాబాద్ జిల్లా కురవి ఆలయంలో అధికారులు అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో స్వామి వారి విశ్రాంతి సేవా సమయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం మూసి ఉంచే సమయంలో కవితను లోపలికి అనుమతించడం, ప్రత్యేక పూజల్లో పాల్గొనడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: RRB Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో భారీ ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పొడగింపు..
అయితే, అంతకుముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కురవి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ జడ్పీటీసీ కొణతం కవిత, కాంపల్లి సొసైటీ చైర్ పర్సన్ కొండపల్లి శ్రీదేవి, అమ్రీ బాయి, లక్ష్మీ రాజు నాయక్ తదితరులు ఆమెకు మంగళహారతితో స్వాగతం చెప్పారు. నేరడ క్రాస్ రోడ్డు వద్ద గల అమరవీరుల స్థూపానికి కల్వకుంట కవిత పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెంచు గిరిజన కోలాటం నృత్య కళాకారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకాగా, ర్యాలీగా వీరభద్ర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఉత్సాహంగా కదిలారు. అయితే ఆలయంలో క్లోజింగ్ సమయంలో స్వామి వారిని దర్శంచుకొనడం పట్ల కవితపై, ఆలయ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ALSO READ: CM Revanth Reddy: వారిని తీసుకురండి.. 48 గంటల్లో KTRను బొక్కలో వేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
సాధారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు విశ్రాంతి సేవా సమయంలో దేవాలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో భక్తులను ఎవరినీ స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వరు. కానీ ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కవిత ఆలయానికి రావడంతో అధికారులు నిబంధనలు పక్కన పెట్టి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయం తలుపులు తెరిచి కవితతో ప్రత్యేక పూజలు కూడా చేయించారు. ఆలయ అధికారులు అత్యుత్సాహం పై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు ఓ రూల్.. వీఐపీలకు ఓ రూలా..? అంటూ మండిపడుతున్నారు. దేవుడి దగ్గరే సమానత్వం లేకుంటే ఎలా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.