Virat Kohli Fans : ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. వాస్తవానికి ఈ టోర్నీ వారం రోజుల పాటు వాయిదా పడటంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. నేటి నుంచి ఐపీఎల్ పున: ప్రారంభం కానుంది. ఇవాళ జరుగబోయే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. కేకేఆర్ కి ఇది కీలక మ్యాచ్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే.. కేకేఆర్ ప్లే ఆప్స్ నుంచి తప్పుకున్నట్టే. అయితే మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోనుంది. చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా మ్యాచ్ కి ఇవాళ విరాట్ కోహ్లీ అభిమానులు అందరూ 18 నెంబర్ జెర్సీ వేసుకోనున్నారు. ఇదే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ అభిమానుల ఫేర్వేల్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read : Rohit Sharma: బాపురే.. రోహిత్ శర్మ Push-Ups చూడండి.. మొత్తం గాల్లోనే
విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఛాలెంజ్ కి సిద్ధం అవుతున్నాడు. ఇండియా-పాక్ ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు ఐపీఎల్ వాయిదా పడింది. ప్రస్తుతం పున:ప్రారంభం కానుండటంతో మిగిలిన మ్యాచ్ ల్లో రచ్చ చేయాలని చూస్తున్నాడు కోహ్లీ. ఇక నుంచి ఐపీఎల్ మ్యాచ్ లతో పాటు టీమిండియా తరపున వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు కింగ్. ఏడాదికి ఒకసారి ఐపీఎల్ రూపంలో టీ-20 ఫార్మాట్ లో కనిపించనున్నాడు. కోహ్లీ అభిమానులు అతని రిటైర్మెంట్ ప్రకటించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరి కొన్ని సంవత్సరాలు ఆడతాడు అనుకుంటే.. అర్థాంతరంగా గుడ్ బై చెప్పడంతో షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలో ఆ బాధ నుంచి కోలుకుంటున్న ఫ్యాన్స్.. తమ అభిమాన ఆటగాడికి గ్రాండ్ ట్రిబ్యూట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కేకేఆర్ మధ్య జరిగే మ్యాచ్ తో క్యాష్ రిచ్ లీగ్ మళ్లీ ప్రారంభం కానుంది. మ్యాచ్ లో బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ కోసం అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి.. ఇవాళ జరగబోయే మ్యాచ్ లో ఆర్సీబీ జెర్సీ కి బదులు టీమిండియా కి ఆడినప్పుడు కోహ్లీ వేసుకున్ 18 నెంబర్ వైట్ జెర్సీలతో చిన్న స్వామి స్టేడియంలో సందడి చేయనున్నారు ఫ్యాన్స్. మైదానం మొత్తాన్ని తెలుపుమయం చేసేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులు. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం దగ్గర ఫ్యాన్స్ వైట్ జెర్సీలతో హంగామా చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసినటువంటి నెటిజన్లు మీ అభిమానం సల్లగుండ అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఇది అభిమానం అంటే అని మెచ్చుకుంటున్నారు. మరోవైపు కోహ్లీ రాణించినా.. విఫలమైనా కెరీర్ మొత్తం అండగా ఉన్న ఇలాంటి ఫ్యాన్ బేస్ చాలా అరుదు అని చెబుతున్నారు నెటిజన్స్.