EPAPER

Pakistan Cricket Players: అమెరికా నుంచి లండన్ కు.. పాకిస్తాన్ వెళ్లని క్రికెటర్లు

Pakistan Cricket Players: అమెరికా నుంచి లండన్ కు.. పాకిస్తాన్ వెళ్లని క్రికెటర్లు

Babar Azam and 5 others Wont Return to Pakistan After T20 World Cup 2024 Exit: టీ 20 ప్రపంచకప్ లో ఘోర వైఫల్యం కారణంగా పాకిస్తాన్ క్రికెటర్లు స్వదేశం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్ తో సహా ఐదుగురు క్రికెటర్లు అమెరికా నుంచి సరాసరి లండన్ కి వెళ్లారని తేలింది. అక్కడే లీగ్ మ్యాచ్ లు ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఒకట్రెండు నెలల తర్వాత పాకిస్తాన్ వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.


మరి పాకిస్తాన్ ఆడబోయే సిరీస్ లకు వీరు అందుబాటులో ఉండరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు అనుమతి తీసుకున్న తర్వాతే వీరందరూ పాకిస్తాన్ రాకుండా లండన్ వెళ్లారని అంటున్నారు. ఇక్కడ వేడి సద్దుమణిగిన తర్వాత రమ్మనమని పాక్ క్రికెట్ బోర్డు పెద్దలే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఓటమిపై బాబర్ అజామ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది మెయిల్ ద్వారా పంపించాడని అంటున్నారు. లీగ్ దశలో ఓటమి అనంతరం ప్రెస్ తో బాబర్ మాట్లాడాడు.   కెప్టెన్సీ వదిలేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. పాకిస్తాన్ వెళ్లాక సమాధానం చెబుతానని అన్నాడు. కానీ ఇప్పడు రూట్ మార్చి లండన్ వెళ్లిపోవడంతో సీనియర్లు, అభిమానులు మళ్లీ నిరసన గళమెత్తే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.


Also Read: టీ 20 ప్రపంచకప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకంపనలు.. మళ్లీ ఇదెక్కడి గొడవరా బాబూ !

టీ 20 వరల్డ్ కప్ వైఫల్యంపై అసలేం జరిగిందనేది చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఆ రివ్యూ మీటింగ్ లో కెప్టెన్ కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు. మరి బాబర్ లండన్ వెళ్లిపోతే ఎలా? ఇది బాధ్యతారాహిత్యమని సీనియర్లు సీరియస్ అవుతున్నారు.

29 ఏళ్ల బాబర్ ముందు ఎంతో ఉజ్వలమైన కెరీర్ ఉందని అంటున్నారు. కానీ తన ఆట తనని ఆడనివ్వడం లేదని, కెప్టెన్సీ ఇచ్చి అతని భవిష్యత్తుతో ఆటలాడుతున్నారనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఇకపోతే బాబర్ తో పాటు పాకిస్తాన్ వెళ్లిన క్రికెటర్లలో మహ్మద్ అమిర్, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్ ఉన్నారు. వీళ్లందరూ కూడా లండన్ విమానం ఎక్కారని అంటున్నారు.

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×