Namibia beat Oman on Super Over: అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ 20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పోటీలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా బ్రిడ్జి టౌన్ వేదికగా జరిగిన నమీబియా- ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరకు మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇందులో నమీబియా విజయం సాధించింది.
బ్రిడ్జి టౌన్ వేదికగా నమీబియా- ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన నమీబియా ఫీల్డింగ్ ఉంచుకుంది. ఒమన్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఆది నుంచే ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ జట్టు 19.5 ఓవర్లకు 109 పరుగులు మాత్రమే చేసింది. ఏడుగురు ఆటగాళ్లు సింగల్ డిజిట్‌తో సరిపెట్టుకున్నారు. ఖలిద్ ఒక్కడే 34 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
110 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు ఓ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో ఒమన్ తడబడింది. కేవలం ఓ వికెట్ నష్టానికి 10 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నమీబియా విజయం సాధించింది.
ALSO READ: పాపువా న్యూగినీపై.. అతికష్టమ్మీద గెలిచిన వెస్టిండీస్
ఐపీఎల్ హిస్టరీలో సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లు ఇప్పటివరకు నాలుగు. అదే ప్రపంచకప్‌లో అయితే మూడోసారి. 2007లో ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ తొలిసారి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. రెండోది 2012లో న్యూజిలాండ్- శ్రీలంక మధ్య మ్యాచ్‌లో లంకేయులు విజయం సాధించారు. ఇక మూడోది వెస్టిండీస్- న్యూజిలాండ్ మధ్య జరిగింది. అందులో విండీస్ ఆటగాళ్లు విజయం సాధించారు. తాజాగా ఒమన్-నమీబియా మధ్య మ్యాచ్ కావడం గమనార్హం.