E-Paper
Advertisement

Tanveer Ahmed: బాబ‌ర్ ఆజంను ఇండియాకు ర‌ప్పించి, క్యాష్ చేసుకోవాల‌ని BCCI కుట్ర చేస్తోంది

Tanveer Ahmed: బాబ‌ర్ ఆజంను ఇండియాకు ర‌ప్పించి, క్యాష్ చేసుకోవాల‌ని BCCI కుట్ర చేస్తోంది
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో బిగ్ బాష్ లీగ్ ( Big Bash League) గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. మొట్ట మొదటిసారిగా ఇండియాలోనే బిగ్ బాష్ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఈ టి20 లీగ్ లో భాగంగా తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం ( M.A. Chidambaram) స్టేడియంలో నిర్వహించేందుకు ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట. ఇలాంటి క్రమంలో ఈ టోర్నమెంట్ కోసం ఇండియాకు బాబర్ ఆజం (babar azam ) వస్తాడని ఈ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

ఇండియాకు బాబ‌ర్ ఆజంను ర‌ప్పించేందుకు BCCI తహతహలాడుతోంది

Advertisement

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను ఇండియాకు రప్పించేందుకు బీసీసీఐ తహతహలాడుతోందని.. అందుకే బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్ చెన్నైలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా బీసీసీఐ ప్లానింగ్ లో భాగంగానే జరుగుతోందని బాంబు పేల్చారు. ఇండియాకు బాబర్ ఆజంను రప్పించి, క్యాష్ చేసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. బీసీసీఐకి ( BCCI) ప్ర‌తీది డ‌బ్బుల కోసం చేస్తుంద‌ని, అందుకే ఆస్ట్రేలియా బోర్డుతో ( Cricket Australia ) కుట్ర‌ల‌కు తెర‌లేపింద‌న్నారు. దీంతో బాబర్ ఆజం పైన ( Babar Azam) తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనికి ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇండియాలో అడుగుపెడితే బాబర్ ఆజంను కుక్క కూడా పట్టించుకోదని చురకలు అంటిస్తున్నారు.

ఇండియాలో బిగ్ బాష్ లీగ్..బీసీసీఐ ప్లాన్ అదుర్స్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తరహా లోనే ఆస్ట్రేలియా కు చెందిన బిగ్ బాష్ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే ఎక్కువగా క్రికెట్ చూసే ఇండియాలో ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ప్రారంభ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో క్రికెట్ ఎక్కువ చూస్తారు కాబట్టి… ఈ లీగ్ కూడా నిర్వహిస్తే… బిగ్ బాష్ కు మరింత ఆదరణ లభిస్తుందని ఒక అంచనాకు వచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. అందుకే 2026-27 బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ప్రారంభ మ్యాచ్ ను చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు బిసిసిఐ తో కూడా ఒప్పందం కుదుర్చుకుందట క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ డిసెంబర్ రెండో వారంలో ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సిడ్నీ సిక్సర్స్ తరఫున బాబర్ ఆజం ఆడుతున్నాడు కాబట్టి… అతడు కూడా ఇండియాలో పర్యటిస్తాడని వార్తలు వస్తున్నాయి. దీనిపైనే తన్వీర్ అహ్మద్ స్పందిస్తూ.. బీసీసీఐ ని కించపరిచే ప్రయత్నం చేశాడు.

Advertisement

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×