E-Paper
Advertisement

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. బీజేపిలోకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు జంప్..?

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. బీజేపిలోకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు జంప్..?

AAP Split: ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరతీశారు. రాజ్యసభలోని ఆప్ ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారు.

ముగ్గురు రాజ్యసభ సభ్యులు

ఢిల్లీ, పంజాబ్ రాజకీయాల్లో అనతి కాలంలోనే తిరుగు లేని శక్తి ఎదిగి.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్న ఆమ్‌ఆద్మీపార్టీలో ముసలం పుట్టింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు.. రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇటీవల రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపునకు గురైన యువ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఇది కొంత వరకు ఊహించిన పరిణామమే అయినా ఆయనతో పాటు మరో ఇద్దరు ఎంపీలు కూడా ఆప్‌కు గుడ్‌ బై చెప్పారు. రాజ్యసభలోని ఆప్ ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది పార్టీని వీడుతున్నారు. త్వరలో ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారు.

అది ఇప్పుడు నిజం..?

గత కొంత కాలంగా పార్టీ హైకమాండ్‎తో రాఘవ్ చద్దాకు పొసగడం లేదు. డిప్యూటీ లీగర్‌గా ఉన్న చద్దా .. ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నారనీ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నారంటూ కొంత కాలం క్రితం ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో కీలక రాజకీయ అంశాలకు బదులు.. ఎయిర్‌పోర్టులో సమోసాల ధరలు వంటి స్టాఫ్ అంశాలపై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. అయితే ప్రజల కోసం పని చేస్తున్న తనను కావాలనే అధిష్టానం టార్గెట్ చేసిందంటూ అప్పట్లో రాఘవ్ చద్దా విమర్శిచారు. పంజాబ్ ప్రభుత్వం రాఘవ్ చద్దాకు భద్రత తొలగించిన వెంటనే కేంద్రం జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. దాంతో ఆయన పార్టీ వీడతారని అప్పుడు ప్రచారం జరిగింది. అది ఇప్పుడు నిజం అయ్యింది. అయితే ఆప్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ ఆప్‎కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం మాత్రం ఊహించని పరిణామం.

Also read: డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు

బీజేపీలో విలీనం..

ఆప్ ప్రస్తుతం అవినీతిపరుల చేతుల్లో ఉందని, ఎంతో కష్టపడి పార్టీని పైకి తీసుకొచ్చామని చద్ధా విమర్శించారు. ఆయన సహా ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరనున్నట్టు వెల్లడించారు. అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‎తో కలిసి రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడారు. తాను ఇన్ని రోజుల్లో సరైన పార్టీలో లేనని ఆప్‎ను విమర్శించారు. సొంత పార్టీనే తనను అణగొక్కేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల సభ్యులమైన తాము భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

షాకింగ్ పరిణామం

ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్‌కి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. ఇటీవలే డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించి.. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించారు. మిట్టల్ కూడా కేజ్రీవాల్‌కు హ్యాండిచ్చి, బీజేపీలో చేరుతుండటం షాకింగ్ పరిణామం. రాజ్యసభలో ఆప్‌కి మొత్తం 10 మంది ఎంపీలు ఉండగా.. ఇప్పటికే హర్బజన్ సింగ్, స్వాతి మలివాల్‌లు పార్టీకి దూరమయ్యారు. బీజేపీలో విలీనమవుతున్న ఎంపీలలో హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ ఉన్నారని, మరో నలుగురు రాజిందర్ గుప్తా, విక్రమ్ సింగ్ సాహ్ని, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌ల పేర్లను చద్దా వెల్లడించారు. తాను తన జీవితంలోని 15 ఏళ్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అంకితం చేశారు.. ఇప్పుడు ఆ పార్టీ అవినీతిపరుల చేతుల్లో ఉందని విమర్శించారు. తమ వెంట 8 మంది ఎంపీలు ఉన్నారని తెలిపారు. మరోవైపు రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం ఊపందుకుంది.

ఏడుగురు ఎంపీలు సంతకం

అటు రాజీనామాల అంశంపై రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగ నిబంధనలను అనుసరించి, రాజ్యసభలోని ఆప్ ఎంపీలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది బీజేపీలో విలీనమయ్యారని వెల్లడించారు. ఏడుగురు ఎంపీలు సంతకం చేసిన పత్రాన్ని రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించినట్లు తెలిపారు. తాను మరో ఇద్దరు ఎంపీలతో కలిసి, సంతకం చేసి పత్రాలను వ్యక్తిగతంగా అందజేసినట్లు తెలిపారు. రాజ్యసభలో ప్రస్తుతం ఆమ్‌ఆద్మీ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలిగించడంతో ఒక్కసారిగా అంతర్గత విభేదాల అంశం తెరపైకి వచ్చింది. పైకి చెబుతున్న కారణాలేమైనా .. రాఘవ్ చద్దాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కేజ్రీవాల్.. ఆయనపై వేటు వేశారన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది.

Also Read: అశ్వారావుపేటకు గ్రీన్ ఫీల్డ్ సెగ.. కళ తప్పిన వ్యాపార రాజధాని..!

సోషల్ మీడియాలో వైరల్..

పార్లమెంట్‌లో చద్దా సాధారణంగా కామెన్ మ్యాన్‌కు సంబంధించి అంశాలపైనే ప్రస్తావిస్తూ దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. రాజకీయ అంశాల కంటే ఎక్కువగా ప్రజలకు త్వరగా చేరువయ్యే సామాన్య సమస్యలు అంటే విమానాశ్రయాల్లో ఆహార ధరలు, గిగ్ కార్మికుల హక్కులు లాంటి అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా తన సొంత ఇమేజ్‌ను పెంచుకుంటున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీలో బలంగా వినిపిస్తున్న మాట. పార్లమెంటులో చద్దా చేసే ప్రసంగాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేవి. దీంతో ఆమ్‌ఆద్మీ పార్టీలో అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మించిన ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎదిగితే అది పార్టీ ఆధిపత్యానికి ముప్పు అని భావించి ఉండొచ్చన్న చర్చ జరిగింది. రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా ఫాలోయింగ్, యువతలో ఉన్న ఆకర్షణతో పార్టీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారుతున్నారని, ఇది నాయకత్వానికి అసౌకర్యం కలిగించి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మోడీపై విమర్శలు..

చద్దా తన ప్రజాదరణను అడ్డం పెట్టుకుని పార్టీ నిర్ణయాలను బేఖాతరు చేస్తున్నారని, రాజ్యసభలో పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నాయకత్వం భావించింది. దీనివల్ల ఆయనను పార్టీకి భారంగా లేదా ముప్పుగా చూశారనే వాదన ఉంది. అయితే ఆమ్‌ఆద్మీ పార్టీ పైకి చెబుతున్న కారణాలు మాత్రం వేరేగా ఉన్నాయి. పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేయడానికి చద్దా భయపడుతున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. పంజాబ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్ర సమస్యలను సభలో బలంగా లేవనెత్తలేదని ఆప్ స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

బీజేపీతో రాఘవ్‌ చద్దాకు సాన్నిహిత్యం

ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు కోరుతూ పార్టీ ఇచ్చిన నోటీసుపై సంతకం చేయకపోవడం, విపక్షాలు వాకౌట్ చేసినప్పుడు సభలోనే కూర్చోవడం వంటి చర్యల ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు భావించారు. 2024లో లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో, రాఘవ్ చద్దా కంటి శస్త్రచికిత్స పేరుతో విదేశాల్లో ఉండి పార్టీకి అండగా నిలవలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక పంజాబ్‌ రాజకీయాల్లో రాఘవ్ చద్దా సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు బీజేపీతో రాఘవ్‌ చద్దాకు సాన్నిహిత్యం పెరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయనపై పార్టీ వేటు వేసింది. డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడమే కాకుండా రాఘవ్‌ చద్దాకు సభలో మాట్లాడే అవకాశం కల్పించొద్దని రాజ్యసభ చైర్మన్‌ను కోరింది. ఈ వ్యవహారం మొత్తం ముదరడంతో చివరికు రాఘవ్ చద్దా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతే కాదు రాజ్యసభలోని మొత్తం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈ పరిణామం ఆమ్‌ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెబుతున్నారు.

Storey By: Anup Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×