Tanveer Ahmed: మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మధ్య లీగ్ దశ మ్యాచ్ జరిగింది. ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది టీమిండియా. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా విసిరిన పంజా దెబ్బకు 64 పరుగులు తేడాతో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క మ్యాచ్ గెలిచి సంబరాలు అతిగా చేసుకోకూడదని.. ముందుంది ముసళ్ళ పండుగ అంటూ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చారు. గ్రూప్ స్టేజ్ లో టీమిండియా చేతిలో ఓడిపోయినప్పటికీ… ఫైనల్స్ లో మాత్రం మిమ్మల్ని ఓడించడం గ్యారంటీ అంటూ తన్వీర్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. కచ్చితంగా టీమిండియాను ఫైనల్స్ లో ఓడించి టైటిల్ గెలుస్తామని ప్రకటించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా నిన్న పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా మహిళల జట్టును కించపరుస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మ్యాచ్ గెలవగానే సంబరాలు చేసుకోకండి అని.. ఫైనల్స్ లో కచ్చితంగా టీమిండియాను ఓడించి తీరుతామని వార్నింగ్ ఇచ్చారు. ఐసీసీ అండదండలతో టీమిండియా ఇన్ని రోజులు గెలుచుకుంటూ వచ్చిందని, ఇకపై వాళ్ళ ఆటలు సాగబోవని వార్నింగ్ ఇచ్చారు. మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ వరకు పాకిస్తాన్ దూసుకు వెళ్లడం గ్యారంటీ అన్నారు. ఆ సమయంలో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ కచ్చితంగా టైటిల్ గెల్చుకుంటుందన్నారు.
ఆ నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఫైనల్స్ లో టీమిండియాను ( Team India) ఓడించకపోతే తాను దేనికైనా సిద్ధమన్నారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా రియాక్ట్ అయ్యాడు. టీమిండియా చేతిలో ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఓడిపోతూనే ఉందని బాంబు పేల్చారు. ఇలా ఓడిపోయి తాము విసిగిపోయామని ఎమోషనల్ అయ్యారు. అసలు టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుంటే.. కామెంట్రీ ప్యానల్ లో ఉండలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు షోయబ్ అక్తర్. ఇలాగే పాక్ ప్లేయర్లు ఆడితే, క్రికెట్ చూడకుండా అవుతుందని తెలిపారు.