Tanveer Ahmed-Ishan Kishan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) కంటే ముందు ప్రత్యర్థి జట్లకు డేంజర్ బెల్స్ పంపించాడు ఇషాన్ కిషన్. నిన్న న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand, 5th T20I) మధ్య తిరువనంతపురం ( Greenfield International Stadium, Thiruvananthapuram) వేదికగా ఐదవ టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 42 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు ఇషాన్ కిషన్. మొన్న అభిషేక్ శర్మ ఇరగదీయగా ఇప్పుడు ఇషాన్ కిషన్ దుమ్ము లేపాడు. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ విషయం కక్కుతోంది. ఇషాన్ కిషన్ సెంచరీ నమోదు చేసిన తరుణంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ లాగానే ఇషాన్ కిషన్ ( Ishan Kishan) బ్యాట్ లో స్ప్రింగులు ( Springs) ఉన్నాయని బాంబు పేల్చారు. ఇదంతా ఐసీసీ అధ్యక్షుడు జై షాకు తెలిసే జరుగుతోందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్లేయర్లందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఫామ్ లో లేని సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav) కూడా ఇరగదీస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక అటు అభిషేక్ శర్మ కూడా మొన్న రఫ్ ఆడించిన సంగతి తెలిసిందే. నిన్న ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ కూడా నమోదు చేశాడు. కాటేరమ్మ కొడుకులాగా అవతారం ఎత్తి విధ్వంసం సృష్టించాడు. 42 బంతులలోనే సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ను అందరూ మెచ్చుకుంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం విషం కక్కుతున్నారు.
ఇషాన్ కిషన్ ఆడిన బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వెల్లడించారు. నిన్నటి మ్యాచ్ లో చాలా అనుమానాలు ఉన్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ కిషన్ బ్యాట్ లో ఖచ్చితంగా స్ప్రింగులు ఉన్నాయని.. అందుకే భయంకరంగా బ్యాటింగ్ చేశాడని ఆరోపణలు చేశారు. ఇక తిరువనంతపురం స్టేడియం చాలా చిన్నగా ఉందని, బౌండరీ గేటు సైజు 35 మీటర్లు ఉందని వెల్లడించారు. అందుకే ఇషాన్ కిషన్ 42 బంతుల్లో సెంచరీ చేసినట్లు విషం కక్కారు తన్వీర్ అహ్మాద్. ఇండియా ఏ మ్యాచ్ ఆడినా చీట్ చేస్తుందని బాంబ్ పేల్చారు. ఇదంతా జై షాకు ( Icc Jay Shah) తెలిసే జరుగుతోందని ఆరోపణలు చేశారు.
Also Read: Yuvraj Singh: యువరాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోటల్ లో చెప్పులు కూడా !
?igsh=bnFoaHRqN3E5bTYz