Tanveer Ahmed: ట్రై సిరీస్ లో (Tri Nation A Series in Sri Lanka 2026) భాగంగా శ్రీలంక వర్సెస్ టీమిండియా ఏ (Sri Lanka A vs India A) జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లగా.. అదృష్టం కొద్దీ టీమిండియాపై శ్రీలంక విజయం సాధించింది. ఈ క్రమంలో శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi fight) గొడవ పెట్టుకున్న సంఘటన హాట్ టాపిక్ అయింది. వాస్తవంగా సూపర్ ఓవర్ పూర్తయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న వైభవ్ ను అనవసరంగా శ్రీలంక ప్లేయర్లు స్లెడ్జింగ్ చేశారు. దాంతో సహనం కోల్పోయిన వైభవ్ గొడవకు దిగాడు. అయితే ఈ సంఘటనలో వైభవ్ సూర్యవంశీని విలన్ చేస్తూ చూపిస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం, వైభవ్ సూర్యవంశీని విమర్శిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఐపీఎల్ కాదని..ఎక్కువ చేస్తే లంకలోనే పాతరేస్తారు, వైభవ్ కు తన్వీర్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న వైభవ్, కాస్త క్రమ శిక్షణగా వ్యవహరించాలని సూచనలు చేశారు.
శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ పెట్టుకున్న సంఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్నటి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిందని.. అందుకే వైభవ్ గొడవకు దిగినట్లు ఆగ్రహించారు. మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారి వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లడిలా గొడవ పెట్టుకుంటున్నాడని సీరియస్ అయ్యారు. వైభవ్ సూర్యవంశీకి గొడవ పెట్టుకోవడం పాత అలవాటేనని సెటైర్లు పేల్చారు. ఇలాగే ప్రతిదానికి గొడవ పడితే వైభవ్ సూర్యవంశీ కెరీర్ తొందరగానే ముగుస్తుందని హెచ్చరించారు. బాబర్ ఆజం రేంజ్ కు చేరుకోవాలని వైభవ్ సూర్యవంశీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడని.. కానీ ఇలా వ్యవహరిస్తే కష్టమేనని బాంబు పేల్చారు.
చిన్న జట్లను టార్గెట్ చేసి సిక్సర్లు అలాగే బౌండరీలు కొట్టి రికార్డులు సృష్టిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. కానీ అసలు సిసలు పాకిస్తాన్ పై వైభవ్ ఆడి, తన సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అంతేగాని ఇలా శ్రీలంక బచ్చా క్రికెటర్ల పై గొడవకు దిగితే ఏం వస్తుందని ప్రశ్నించారు. ఇలా చిన్న స్థాయి క్రికెటర్ల పై గొడవపడ్డ వైభవ్ సూర్యవంశీ పై ఐసీసీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తాను లేఖ రాస్తానని కూడా హెచ్చరించారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.