E-Paper
Advertisement

Tanveer Ahmed: జై షా వ‌చ్చి కాళ్లు మొక్కినా ఇండియాకు మొహ్సిన్ న‌ఖ్వీ వెళ్లొద్దు!

Tanveer Ahmed:  జై షా వ‌చ్చి కాళ్లు మొక్కినా ఇండియాకు మొహ్సిన్ న‌ఖ్వీ వెళ్లొద్దు!
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈనెల 31వ తేదీన జరగనుంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) కూడా ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఫైనల్ కు హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. ఐసీసీ ఇచ్చిన ఆహ్వానం మేరకు ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడట మొహ్సిన్ నఖ్వీ. అయితే మొహ్సిన్ నఖ్వీ రాక పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. లేటెస్ట్ గా మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) కూడా రియాక్ట్ అయ్యారు. ఐసీసీ బాస్ జై షా వచ్చి కాళ్లు పట్టుకున్నా, మొహ్సిన్ నఖ్వీ ఇండియాకు వెళ్ళకూడదని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. అలా వెళితే పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోతుందని బాంబు పేల్చారు. మొహ్సిన్ నఖ్వీ వెళ్లకుండా పాకిస్తాన్ సర్కార్ కూడా ఆదేశాలు ఇవ్వాలని సూచనలు చేశారు తన్వీర్ అహ్మద్. మొహ్సిన్ నఖ్వీ వెళితే, ఇండియా ముందు పాకిస్తాన్ త‌లొగ్గిన‌ట్లు అవుతుంద‌న్నారు.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

జై షా వ‌చ్చి కాళ్లు మొక్కినా ఇండియాకు మొహ్సిన్ న‌ఖ్వీ వెళ్లొద్దు

Advertisement

ఐసీసీ ( ICC) పిలుపు మేరకు ఈ నెల 30, 31వ తేదీలలో ఇండియాలో మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) పర్యటిస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకైతే పాకిస్తాన్ సర్కార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ… ఇండియాకు మాత్రం మొహ్సిన్ న‌ఖ్వీ వస్తాడనే వార్త బాగా వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే కూర్చుని ఐపిఎల్ 2026 ఫైనల్ చూస్తాడని కూడా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొహ్సిన్ న‌ఖ్వీకి కచ్చితంగా ఆహ్వానం వస్తుందని నేను ఏడాది కిందటే చెప్పాను.. ఇప్పుడు అదే జరిగిందని వెల్లడించారు. ఐసీసీ నుంచి మొహ్సిన్ న‌ఖ్వీకి ఆహ్వానం రావడం పాకిస్తాన్ గౌర‌వాన్ని మరింత పెంచిందన్నారు.

అయినప్పటికీ ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలను నేపథ్యంలో అక్కడికి మొహ్సిన్ న‌ఖ్వీ వెళ్లకూడదన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ రావాలని చెప్పినా కూడా, బీసీసీఐ.. టీమ్ ఇండియాను పంపించలేదని మండిపడ్డారు. అలాంటప్పుడు మొహ్సిన్ న‌ఖ్వీ ఇండియాకు ఎందుకు వెళ్లాలి ? అలా వెళ్తే పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోతుందని మండిపడ్డారు. తన మాట విని, ఐసీసీ నిర్వహించే కార్యక్రమాలకు వర్చువల్ గా హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఇండియాకు వెళ్ళకూడదని కోరారు. కాగా అస‌లు న‌ఖ్వీకి ఐసీసీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేద‌ని, కావాల‌నే పాకిస్తాన్ సోష‌ల్ మీడియా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని ఇండియ‌న్స్ కౌంట‌ర్లు ఇస్తున్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×