Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) ముగిసిన తర్వాత టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుపై తప్ప మిగతా మ్యాచ్ లలో చిత్తుగా ఓడిపోతోంది టీమిండియా. ఐర్లాండ్ లాంటి పసి కూన జట్టు చేతిలో వైట్ వాష్ ( White Wash) అయింది టీమ్ ఇండియా. ఆరు నెలల కిందట ఛాంపియన్ అయిన టీమిండియా ( TeaM India), ఇప్పుడు వైట్ వాష్ కావడం గమనార్హం. ఇటు ఇంగ్లాండ్ తో ( England) జరుగుతోన్న టి20 సిరీస్ లో కూడా రెండో మ్యాచ్ లో ఓడిపోయింది భారత్. ఇలాంటి నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ గడ్డలపై ఇండియన్స్ జీరోలు, 200 కూడా కొట్టలేకపోతున్నారని తన్వీర్ అహ్మద్ హేళన చేశారు. ఐపీఎల్ లో మాత్రం 300 గ్యారెంటీ అంటూ చురకలు అంటించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ లలో భాగంగా టీమిండియా (Team India ) విఫలమవుతోంది. ఈ తరుణంలో టీమిండియాను విమర్శిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లలో (Indian Premier League 2026 tournament) అద్భుతంగా ఆడిన టీమిండియా ప్లేయర్లు… విదేశీ గడ్డలపై మాత్రం విఫలమవుతున్నారని హేళన చేశారు. ఐర్లాండ్ నుంచి మొదలుకొని ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టి20 వరకు లెక్క గట్టి మరి ఇండియాను విమర్శలు చేశారు. గడిచిన నాలుగు మ్యాచ్ లలో టీమిండియా 200 స్కోర్ కూడా దాటలేకపోయిందని సెటైర్లు పేల్చారు. విదేశీ మైదానాలు కాబట్టే టీమిండియా ప్లేయర్లు 200 కొట్ట లేకపోతున్నారని చురకలు అంటించారు.
విదేశీ గడ్డలపై టీమిండియా ప్లేయర్లకు ఆడడం చేతకావడం లేదని.. ఈ మైదానాలలో టీమిండియా ( Team India) ప్లేయర్లు జీరోలు అంటూ హేళన చేశారు తన్వీర్ అహ్మద్. ఐపీఎల్ (IPL ) లాంటి స్వదేశీ ఫ్లాట్ మైదానాలలో మాత్రం ఇండియన్ ప్లేయర్లు పులుల లాగా రెచ్చిపోతారని పేర్కొన్నారు. అందుకే ఐపీఎల్ లో 250, 300 దాకా పరుగులు చేస్తున్నారని గుర్తు చేశారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ కూడా సెంచరీ చేస్తున్నాడని… దారుణమైన కామెంట్లు చేశారు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న 5 టీ20 ల సిరీస్ నేపథ్యంలో… ఐర్లాండ్ లో జరిగిన సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా వైట్ వాష్ కావడం గ్యారంటీ అంటూ వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్.