Mohammad Kaif: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత టీమిండియా ఫుల్ బిజీగా మారిన సంగతి తెలిసిందే. మొన్ననే ఐర్లాండ్ సిరీస్ ఆడిన టీమిండియా… ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ లో తలపడుతోంది. ఈ టి20లకు సూర్యకుమార్ యాదవ్ ను పక్కకు పెట్టి శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇచ్చారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా జింబాబ్వే టూర్ కోసం మరో జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. సూర్యను తొలగించిన కోపంలో ఇప్పటికే అభిమానులు ఉండగా… తాజాగా వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను కూడా పక్కకు పెట్టారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈ జింబాబ్వే టూర్ వెళ్లనుంది టీం ఇండియా. ఇందులో సంజు శాంసన్ స్థానంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. దీంతో బిసిసిఐపై మళ్ళీ ట్రోలింగ్ మొదలైంది.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో అద్భుతంగా రానించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన రియల్ హీరో సంజు శాంసన్ ను జింబాబ్వే టూర్ నుంచి తప్పించి… 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు అవకాశం ఇవ్వడం పై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) సీరియస్ అయ్యారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ (VAIBHAV SOORYAVANSHI) ఓపెనర్లుగా పనికిరారని బాంబు పేల్చాడు. వాళ్ళిద్దరిని పెట్టుకుని, టీమిండియా ఎక్కువ రోజులు గెలవబోదని స్పష్టం చేశారు. వరల్డ్ కప్ లో కూడా ఈ ఓపెనర్ల పెయిర్ పనికిరాదని పరువు తీశారు. వాళ్ళిద్దరిని పట్టుకొని వరల్డ్ కప్ కు వెళితే.. టీమిండియా గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అవుతుందని హెచ్చరించారు. అనవసరంగా సంజు శాంసన్ ను తొలగించి బీసీసీఐ పెద్ద తప్పిదం చేసిందని ఫైర్ అయ్యారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడింది సంజు శాంసన్ ( Sanju Samson) ఒక్కడే రానికి గుర్తు చేస్తున్నారు. అలాంటోడికి అన్యాయం చేసి 15 ఏళ్ల కుర్రాడిని జట్టులోకి తీసుకురావడం తెలివి తక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అలాగే ఫైనల్స్ లో సంజునే నిలబడి.. జట్టును గెలిపించినట్లు స్పష్టం చేశారు. సంజు లేకపోతే టీమిండియా కు వరల్డ్ కప్ వచ్చేది కాదని స్పష్టం చేశారు. అలాంటి సంజు కంటే 15 ఏళ్ల కుర్రాడు మీకు ఎక్కువయ్యాడా? అంటూ నిలదీశారు. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.