Musharraf: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా జట్టులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని.. వచ్చి రాగానే కెప్టెన్సీ బాధ్యతలు దక్కించుకున్నాడు. సీనియర్ క్రికెటర్లను బయటకు పంపించి.. టీమిండియాను బలంగా తయారు చేశాడు. అంతేకాదు టి20 ప్రపంచ కప్ 2007, 2011 వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ 2013 ను టీమిండియా కు అందించాడు మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు నేడు. 45వ వేట అడుగుపెట్టిన మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు ఇవాళ ఉన్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
ఇలాంటి క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ పై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ధోని రియల్ హీరో…నువ్వు హెయిర్ కట్ చేయించుకోవద్దు అంటూ పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ (Pervez Musharraf) సంచలన వ్యాఖ్యలు చేశారు. జులపాలలోనే ధోని అందంగా ఉంటాడని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. పాకిస్తాన్ లోనూ ధోనికి క్రేజ్ ఉందని చెబుతూ, ఈ పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు ధోని ఫ్యాన్స్.
పాకిస్తాన్ అధ్యక్షుడిగా 2001 సంవత్సరంలో బాధ్యతలు తీసుకున్నారు ముషారఫ్. ఆయనకు క్రికెట్ అంటే.. చాలా ఇష్టం. అలాంటి ముషారఫ్ 2023 సంవత్సరంలో మరణించారు. కానీ అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో… పాకిస్తాన్ లో ఇండియా పర్యటించింది. 2006 సమయంలో పాకిస్తాన్ లో పర్యటించి టీమిండియా కీలక వన్డే సిరీస్ ఆడింది. ఆ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఆటపై ప్రశంసల వర్షం కురిపించారు ముషారఫ్. 2006 లో పాకిస్తాన్ పై వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా మ్యాచ్ ను స్వయంగా ముషారఫ్ తిలకించారు. అప్పుడు ధోనీనే కీలక ఇన్నింగ్స్ ఆడి, ఇండియాను గెలిపించాడు. ఈ క్రమంలో ధోని గురించి ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ముషారఫ్. అతని ఇన్నింగ్స్ ను కొనియాడారు.
టీమిండియా విజయంలో అతడి పాత్ర చాలా కీలకమన్నారు. మ్యాచ్ జరుగుతుండగా హెయిర్ కట్ చేయించుకోవాలని ధోనీకి వ్యతిరేకంగా కొంతమంది పాకిస్తాన్ అభిమానులు ప్లకార్డులు పట్టుకున్నారు. అయితే దానికి స్వయంగా పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ కౌంటర్ ఇచ్చారు. ధోని హెయిర్ కట్ తోనే హీరో లాగా ఉంటాడు… ఆ హేర్ అస్సలు కట్ చేయకూడదని కోరారు. ఈ వ్యాఖ్యలు స్వయంగా ధోని ముందే చెప్పారు ముషారఫ్. అయితే లేటెస్ట్ గా ధోని పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో… ముషారఫ్ చేసిన పాత వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ముషారఫ్ పనిచేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
Pervez Musharraf " Dhoni, If you will take my opinion you look good in this haircut,Don't have a haircut "
India travelled to Pakistan and won the series.This is the golden era of India Cricket. Yuvraj and Ms Dhoni finished unlimited matches for india.#SA20 #INDvAFG #PAKvNZ… pic.twitter.com/DMEpjTodhV
— Sujeet Suman (@sujeetsuman1991) January 11, 2024