Wasim Akram: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) గురించి చర్చ జోరుగా సాగుతోంది. వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ఇలాంటి డేంజర్ ఆటగాడిని పక్కకు పెట్టి మరి 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టి20 సందర్భంగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కూడా చేశాడు. అయితే మొదటి మ్యాచ్ సందర్భంగా వైభవ్ విఫలమయ్యాడు. ఇక ఇవాళ టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టి20 జరగనుంది. ఇందులోను కుర్రాడు వైభవ్ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండు జట్టుకు డేంజర్ బెల్స్ పంపించారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ (Wasim Akram). వైభవ్ సూర్యవంశీని పవర్ ప్లే లోపు ఔట్ చేయకపోతే ఇంగ్లాండ్ కొంప మునగడం గ్యారెంటీ అన్నారు. ఐదు నుంచి 6 ఓవర్ల లోపు వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయకపోతే కచ్చితంగా టీమిండియా విజయం సాధించడం పక్కా అని తెలిపారు. పవర్ ప్లే ముగిసిన కూడా ఇంగ్లాండు ప్లేయర్లపై వైభవ్ విరుచుకుపడతాడని అంచనా వేశారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడవ టి20 రాత్రి 10 గంటలకు ఉండనుంది. ఇలాంటి నేపథ్యంలో మూడవ టి20 లో కూడా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వైభవ్ సూర్యవంశీ పై వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సచిన్ టెండూల్కర్ కంటే అత్యంత భయంకరంగా వైభవ్ ఆడుతున్నాడని కొనియాడారు. 15 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసేవాడని గుర్తు చేశారు. ఇదే వయసులో వైభవ్ సూర్యవంశీ… సచిన్ కంటే భయంకరంగా ఆడుతున్నాడు అన్నారు.
సిక్సర్లు అలాగే బౌండరీలు తప్ప సింగిల్స్ అస్సలు తీయడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఆటగాడిని తాను ఎప్పుడు చూడలేదన్నారు. ఛేజింగ్ చేస్తే ఆరు ఓవర్లలోపై మ్యాచ్ ఫినిష్ చేసే దమ్ము వైభవ్ కు ఉందన్నారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పట్ల ఇంగ్లండ్ బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఐదు నుంచి ఆరు ఓవర్ల లోపు వైభవ్ ఔట్ కాకపోతే మాత్రం.. ఇంగ్లాండ్ బౌలర్ల ప్యాంట్లు తడవడం గ్యారెంటీ అని హెచ్చరించారు. అలా కాక వైభవ్ సూర్యవంశీని లైట్ తీసుకుంటే మాత్రం… ఇంగ్లాండు పనైపోతుందని ఎద్దేవా చేశారు.