Gambhir On Sanju Samson: టీమిండియా వర్సెస్ జింబాబ్వే (India tour of Zimbabwe 2026) సిరీస్ నేపథ్యంలో తాజాగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోని టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే ఇందులో అనూహ్యంగా సంజు శాంసన్ పేరును తప్పించారు. అతని స్థానంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బీసీసీఐ గురించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ను ర్యాగింగ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టి20 సందర్భంగా సంజు శాంసన్ ను (sanju samson) తప్పించిన గంభీర్ (Gautam Gambhir).. జింబాబ్వే టూర్ నుంచి కూడా వైదొలిగేలా కుట్రలు చేసినట్లు ఫైర్ అవుతున్నారు.
టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Team India vs Zimbabwe) మధ్య జరగనున్న టి20 సిరీస్ నేపథ్యంలో సంజు శాంసన్ ను పక్కకు పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో సంజు శాంసన్ పైన టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తీసుకువచ్చిన సంజు శాంసన్ టీమిండియా కు చాలా అవసరం అన్నారు. అతడు రెండుసార్లు కాదు 21 సార్లు డకౌట్ అయినప్పటికీ, అతడిని టీమిండియాలో కొనసాగిస్తామని వెల్లడించారు.
ఇదే విషయాన్ని సంజు శాంసన్ తో కూడా గౌతమ్ గంభీర్ పదేపదే వెల్లడించారట. అయితే చివరికి జింబాబ్వే టూర్ నుంచి గంభీర్ ఆదేశాల మేరకు సంజు శాంసన్ నే (Sanju Samson) తొలగించేశారు. ఈ క్రమంలో గంభీర్ పై ( Gambhir) ట్రోలింగ్ మొదలైంది. సంజు శాంసన్ ను నమ్మించి… గొంతు కోశాడని ఫైర్ అవుతున్నారు. మొదట ఇంగ్లాండుతో జరిగిన రెండో టి20 నుంచి తప్పించి… జింబాబ్వే టూర్ వెళ్లకుండా గంభీర్ కుట్రలకు తెరలేపినట్లు ఆగ్రహిస్తున్నారు. మొదటినుంచి సంజు శాంసన్ అంటే గౌతమ్ గంభీర్ ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే స్నేహంగా మాట్లాడి, ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంజు శాంసన్ అభిమానులు.
టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మొత్తం మూడు టీ 20లు జరగనున్నాయి. జూలై 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ మూడు టి20 లు జరగనున్నాయి. జింబాబ్వే తో మ్యాచ్ కాబట్టే సంజు శాంసన్ ను పక్కకు పెట్టినట్లు బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఎలాంటి కుట్ర కోణం లేదని వెల్లడిస్తున్నారు.