Trolls On Narendra Modi Stadium: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ స్టేడియం లో ట్రోఫీలు గెలిస్తే… ఆ జట్టుకు దరిద్రం చుట్టు కోవడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ముందుగా ఆస్ట్రేలియా, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పుడు టీమిండియా కు అదే పరిస్థితి ఎదురవుతోందని… ఇకపై ఫైనల్ మ్యాచ్ లు అహ్మదాబాద్ స్టేడియం లో నిర్వహించకూడదని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం (Ahmedabad’s Narendra Modi Stadium) ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అన్న సంగతి తెలిసిందే. ఒకేసారి లక్షమంది కూర్చుని మ్యాచ్ తిలకించేలా ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్టేడియాన్ని నిర్మించారు. అయితే, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఆ సమయంలో ఫైనల్ జరగగా, కంగారులు చాంపియన్లు అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆస్ట్రేలియా అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. చాంపియన్ ట్రోఫీ, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో కూడా గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయింది. పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓటమిపాలైంది.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం (Ahmedabad’s Narendra Modi Stadium) వేదికగానే 2023 ఐపీఎల్ ఫైనల్ ( IPL 2023) జరిగింది. అక్కడ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్… ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఇప్పటికీ కూడా గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అవుతూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. ఇక 2026 టీ20 ప్రపంచ కప్ లో కూడా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా అహ్మదాబాద్ వేదికగా చాంపియన్ అయింది. మొన్న ఫిబ్రవరిలోనే ఈ టోర్నమెంట్ జరిగింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ((Ahmedabad’s Narendra Modi Stadium)) వేదికగా ఛాంపియన్ అయిన తర్వాత, ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది టీమిండియా. ఇలా మూడు జట్లకు ఇదే పరిస్థితి నెలకొంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్స్ ఆడిన తర్వాత ట్రోఫీలు గెలిస్తే… దరిద్రం చుట్టుకుంటోందని విమర్శలు చేస్తున్నారు. ఇకపై అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ లు అస్సలు నిర్వహించకూడదని కోరుతున్నారు.