Xiaomi Mi 10T 5G Offer: షావోమి కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా Mi సిరీస్‌లో వచ్చే ఫోన్లు ప్రీమియం ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లోని పాపులర్ Xiaomi Mi 10T 5Gపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటిచింది. ఏకంగా రూ.21,000 పైగా తగ్గిన ధరతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే సువర్ణావకాశం వచ్చింది. ఇప్పుడీ ఆఫర్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..
ఈ0 Xiaomi Mi 10T 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని అసలు ధర రూ.42,999గా ఉండేది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ కేవలం రూ.23,399 ధరకే దీన్ని లిస్ట్ చేసింది. అంటే.. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే నేరుగా రూ.19,000 పైగా తగ్గింపు లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న తగ్గింపుతో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. మీకు మరో రూ.1,170 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మొత్తంగా మీకు రూ.21,370 వరకు ఆదా అవుతుంది. అప్పుడు ఈ పవర్‌ఫుల్ ఫోన్ కేవలం రూ.22,229 లకే మీ సొంతమవుతుంది.
Also Read: ఇకపై రాత్రిపూట కూడా సూర్యకాంతి.. అమెరికా కొత్త స్పేస్ ప్రాజెక్ట్‌పై శాస్త్రవేత్తల ఆందోళన ఎందుకు?
ఫీచర్ల విషయానికి వస్తే.. Mi 10T 5G ఫోన్ 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ పాడవకుండా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా సాగడం కోసం ఇందులో 144Hz రీఫ్రెష్ రేట్ అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, 8GB వరకు ర్యామ్ సపోర్ట్‌తో లభిస్తుంది.
ఇక ఫోటోగ్రఫీ కోసం Xiaomi Mi 10T 5Gలో వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 64MP ప్రధాన కెమెరాతో పాటు, 13MP సెకండరీ కెమెరా, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటానికి 5000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. భారీగా పడిపోయిన iPhone Air.. అసలు కారణం ఇదేనా?