IND Vs ENG 5th Test : ఇంగ్లాండ్ (England) తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా సరికొత్త రికార్డును రాసుకుంది. ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. ఇక విదేశీ గడ్డమీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్ గా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లాండ్ 2-1 తో ఆదిత్యంలో ఉంది. ఓవల్ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్ట్ గెలిస్తేనే టీమిండియా సిరీస్ ను 2- 2తో సమం చేయగలదు.
Also Read : IND Vs ENG 5th Test : టీమిండియా ఓపెనర్ మరో సెంచరీ..ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో రెచ్చిపోవాల్సిందే..!
ఇక ఈ మ్యాచ్ లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా(Team India) ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ (Century) సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్ లో ఇది ఆరో సెంచరీ. ఈ సిరీస్ లో రెండవది. అదేవిధంగా జైసూ శతకంలో ఈ సిరీస్ లో టీమ్ ఇండియా తరుపున ఇప్పటికీ 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు చెట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యం కాగా తాజాగా టీమిండియా (Team India) కూడా చరిత్ర పుటల్లో కెక్కింది. ఇదిలా ఉంటే 86 ఓవర్లకు టీమిండియా 380/9 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో సెంచరీలు చేసిన ఆటగాళ్లు
ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టు