IND Vs ENG 5th Test : ఇంగ్లాండ్ (England) తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. లండన్ లోని ఓవల్ మైదానంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 100 పరుగుల మార్కును అందుకున్నాడు. 127 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి సెంచరీ ఈ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ సిరీస్ లో జైస్వాల్ కు ఇది రెండో శతకం. అంతకుముందు లీడ్స్ వేదికగా తొలి టెస్టులో జైస్వాల్ 101 పరుగులు చేశాడు. కాగా ఆండర్సన్ _ టెండూల్కర్ రో ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ టీమిండియా పై 2-1 తో ఆదిత్యంలో ఉంది. ఈ క్రమంలో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరిదైన ఐదో మ్యాచ్ లండన్ లో గురువారం మొదలైంది. టాస్ ఓడి తొలత బ్యాటింగ్ కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read : Mohammed Siraj : అతన్ని తలుచుకుని కన్నీటిపర్యంతం అయిన సిరాజ్.. ఈ బ్రోమాన్స్ అదుర్స్..!
జైస్వాల్ కీలక ఇన్నింగ్స్
తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ పేసర్ గన్ అట్కిన్సర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్ కు వచ్చేసరికి జైస్వాల్ గేరు మార్చాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలోనే అర్థ శతకం పూర్తి చేసుకున్న ఈ ఎడమ చేతివాటం మ్యాటర్ శనివారం దానిని సెంచరీగా మలిచాడు. తద్వారా ఈ సిరీస్ లో రెండో శతకంతో పాటు తన టెస్టు కెరీర్ లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో నాలుగో ఇంగ్లాండ్ మీద కావడంవే కావడం విశేషం. ఇదిలా ఉంటే 75/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన టీమిండియా 80 ఓవర్లకు 342/7 పరుగులు చేసింది.
రాణిస్తున్న టీమిండియా
టీమిండియా బ్యాటర్లలో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఇప్పటి వరకు 342/7 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 118 పరుగులు చేసి టంగ్ బౌలింగ్ ఓవర్టన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ 11 పరుగులు, అకాశ్ దీప్ 66 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఆకాశ్ దీప్ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ 11 పరుగులు.. కరుణ్ నాయర్ 17 పరుగులు, రవీంద్ర జడేజా 27, ధ్రువ్ జురెల్ 27 పరుగులు చేశాడు. ప్రస్తుతం జడేజా, ధ్రువ్ జురెల్ క్రీజులో కొనసాగుతున్నారు. టీమిండియా భారీ స్కోర్ చేస్తేనే ఈ మ్యాచ్ విజయం సాధిస్తుంది. లేదంటే ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది. ఇండియా విజయం సాధించకుంటే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇండియా విజయం సాధిస్తే.. టెస్ట్ సిరీస్ డ్రా గా ముగుస్తుంది. టీమిండియా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో వేచి చూడాలి.