BigTV English

Kingdom 2: కింగ్డమ్ సెకండ్ పార్ట్ కి ముందు గౌతం మాస్ ప్లానింగ్

Kingdom 2: కింగ్డమ్ సెకండ్ పార్ట్ కి ముందు గౌతం మాస్ ప్లానింగ్

Gowtham Tinnanuri : రీసెంట్ గా వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల్లో కింగ్డమ్ కూడా ఒకటి. విపరీతమైన అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. కానీ విజయ్ దేవరకొండకు చాలా సినిమాల తర్వాత అద్భుతమైన సక్సెస్ ఈ సినిమాతో వచ్చింది అనేది ఒప్పుకోవాలి.


గత ఏడు సంవత్సరాలుగా విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ తరుణంలో ఈ సినిమా మాత్రం ఆడియన్స్ కి సంతృప్తిని ఇచ్చింది అని చెప్పాలి. సినిమా సెకండాఫ్ విషయంలో కొద్దిపాటి లోటుపాట్లు ఉన్నాయి కానీ కంప్లీట్ గా సినిమా అయితే మాత్రం బానే ఉంది అనే టాక్ వినిపిస్తూ వస్తుంది.

మాస్ ప్లానింగ్ 


ఈ సినిమా కథను గౌతమ్ తిన్న నూరి రెండు భాగాలుగా రాసినట్లు నాగ వంశీ తెలిపారు. అయితే ఈ కథ రైటింగ్ స్టేజ్ లోనే రెండు భాగాలు అని చెప్పేశారు. అలానే మొదటి పార్ట్ చాలామందికి విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్ లో సేతు అనే ఒక క్యారెక్టర్ ను సినిమాలో చూపించారు. ఫేస్ రివిల్ చేయలేదు కానీ వెనకనుంచి చూపించారు. ఇప్పుడు సేతుకి మరియు సూరికి మధ్య జరగబోయే కథ సెకండ్ పార్ట్ లో ఉంటుంది. అయితే దాని కంటే ముందు సేతు బ్యాక్ స్టోరీని చెప్పడానికి ఒక గంటన్నర నిడివి ఉండే ఒక సినిమా చేయాలి అని గౌతమ్ తిన్ననూరి ఫిక్స్ అయ్యాడు. ఈ సేతు స్టోరీ డైరెక్ట్ గా ఓటిటి విడుదలవుతుంది. ఇప్పుడు ఇద్దరి ప్రపంచాలు తెలుస్తాయి కాబట్టి పార్ట్-2 సినిమాను ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేయగలరు.

సరికొత్త ఆలోచన 

మామూలుగా సేతు కథను ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం పేరును మాత్రమే ప్రస్తావించి క్లైమాక్స్ లో క్యారెక్టర్ ను వెనుక నుంచి చూపించారు. ఇప్పుడు మళ్లీ ఆ క్యారెక్టర్ గురించి సెకండ్ పార్ట్ లో చెప్పాలి అంటే ఆడియన్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కింగ్డమ్ విషయంలో సత్యదేవ్ కి పేరు వచ్చినట్లు మరో స్టార్ హీరోకి కూడా అక్కడ ఎక్కువ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే అతని స్టోరీని సపరేట్ గా చూపించి, ఇద్దరినీ మళ్లీ కింగ్డమ్ 2 లో చూపించే ఆలోచనలో ఉన్నాడు. ఇది ఒక సరికొత్త ఆలోచన అని చెప్పాలి. అలానే కింగ్డమ్ విషయంలో ఆడియన్స్ కి ఉన్న చాలా డౌట్లు గురించి ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ కూడా ఇచ్చేశాడు గౌతం.

Also Read: Lokesh Kanakaraj : నేను నాగర్జున ని చూసి ఫంక్ పెంచాను, రజినీకాంత్ సార్ చాలా నేర్పించారు

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×