AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ చేతికి కీలక వీడియో దొరికింది. నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఉన్న వీడియో సిట్ అధికారులకు లభ్యమైంది. ఆ వీడియోలో వెంకటేషన్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ఫోన్ లోనే వీడియో లభ్యం అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ34 గా వెంకటేష్ నాయుడు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ సంగతి తెలిసిందే.
వెంకటేష్ నాయుడిని రెండు నెలల కిందటనే పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అందువల్ల 2 నెలల కన్నా ముందు ఈ వీడియో తీసి ఉండొచ్చని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇది ఎప్పుడు, ఎక్కడ తీశారు అనేది క్లారిటీగా తెలియదు. వీడియోలో నోట్ల కట్టలను అతను లెక్కిస్తూ ఉన్నట్టు కనబడుతుంది. అసలు ఆ డబ్బును ఎక్కడిది..? ఎక్కడి నుంచైనా.. మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా..? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Narsingh News: ప్రియురాలితో భర్త.. ఇద్దరిని పొట్టుపొట్టు కొట్టిన భార్య.. ఇదిగో వీడియో
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరో పది రోజుల్లో సిట్ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు అందులో వెల్లడిస్తుందని సమాచారం. మూడు రోజుల కిందట సిట్ రూ.11 కోట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో తెరపైకి రావడం కలకలం రేపుతోంది. ఇది ఏపీలో భారీ స్కాం కావచ్చు అని ఈ వీడియోలు, ఆధారాలూ తెలియజేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 48 మంది నిందితులు ఉండగా.. 12 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ: IND Vs ENG 5th Test : టీమిండియా ఓపెనర్ మరో సెంచరీ..ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో రెచ్చిపోవాల్సిందే..!