BigTV English

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

India Nears 92-Year-Old Historic Record In Test Cricket Ahead Of 1st Test Vs Bangladesh: టీ 20 ప్రపంచకప్ తర్వాత శ్రీలంక టూర్.. ఇప్పుడు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ జరగనుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే..సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిస్తే.. 92 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుంది.


ఇక నుంచి ప్రారంభమయ్యే టెస్టుతో వరుసగా పది టెస్టు మ్యాచ్ లు టీమ్ ఇండియా ఆడనుంది. ఇందులో బంగ్లాదేశ్ తో 2, కివీస్ తో 3, ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షి 2023-25 ఫైనల్‌కు ముందు ఇవన్నీ ప్రాక్టీస్ మ్యాచ్ ల్లా ఉపయోగపడతాయని బీసీసీఐ చాలా పకడ్బందీగా షెడ్యూల్ ప్లాన్ చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే ఈ మ్యాచ్ గెలవడం కూడా టీమ్ ఇండియాకు చాలా కీలకమని చెప్పాలి.

అలాగే 1932 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా.. ఇప్పటి వరకు 579 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 178 సార్లు గెలిచింది. అన్నేసార్లు ఓడిపోయింది కూడా..’కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అని దేవదాస్’ చెప్పినట్టు టీమ్ ఇండియా కూడా  గెలుపోటములను సమానంగా బ్యాలన్స్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 222 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఈ సమయంలో చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగే తొలిటెస్టులో గానీ విజయం సాధిస్తే అది 179వ విజయం అవుతుంది.


Also Read: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

ఒకవేళ ఓడిందనుకోండి. ఆ సంఖ్య అప్పుడు 179 అవుతుంది. అప్పుడు దానిని దాటాలంటే మరో రెండు టెస్టు మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది. అంతేకదా.. మనం ఓడితే ఎప్పటిలా 178 దగ్గరే ఉండిపోతాం కదా.. అదీ సంగతి. అందుకని ఇది గెలిచి.. ముందుడుగు వేస్తుంటే.. ఓటమినే దాటుకుంటూ వెళ్లిపోతూ ఉంటాం.

ఇప్పటికే తొలి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ ని తప్పించారు. చివరిగా కేఎల్ రాహుల్ సైతం చోటు దక్కించుకున్నాడు. బహుశా కేఎల్ సరిగా ఆడకపోతే రెండో టెస్టుకు దూరమయ్యేలా ఉన్నాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,  కేఎల్ రాహుల్,  రిషభ్ పంత్(కీపర్), సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ధ్రువ్ జురెల్(కీపర్), ఆర్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×