EPAPER

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

MS Dhoni once kicked a Bottle of Water in Anger, Badrinath explains why: మహేంద్ర సింగ్ ధోనీని అందరూ మిస్టర్ కూల్ అంటారు గానీ.. అంత సీన్ లేదని, అప్పుడప్పుడు గురుడు మంచి హీట్ మీద ఉంటాడని సీఎస్కే మాజీ ఆటగాడు బద్రీనాథ్ వ్యాఖ్యానించాడు. అందరూ చూస్తుంటారని.. బయట గ్రౌండులోనే కూల్ గా ఉంటాడు.. లోపల మాత్రం శివతాండవం ఆడేస్తాడని అన్నాడు.


బద్రీనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనీ కూడా సాధారణ మనిషేనని తెలిపాడు. తను కూడా అప్పుడప్పుడు సంయమనం కోల్పోతాడని అన్నాడు. ఫీల్డ్ లో మాత్రం చాలా నియంత్రించుకుంటాడు. ఎందుకంటే అక్కడ మ్యాచ్ జరిగేటప్పుడు సీరియస్ అయితే, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దాంతో మొత్తం ఆట స్వరూపమే మారిపోతుంది. అందుకే అవన్నీ మనసులోనే అణచిపెట్టుకుంటాడు.

తర్వాత  డ్రెస్సింగ్ రూమ్ లో ఆ బౌలర్ లేదా బ్యాటర్ విషయంలో కొన్ని సూచనలు చేస్తాడు. మ్యాచ్ గెలిస్తే మాత్రం పెద్ద పట్టించుకోడు. భుజమ్మీద చేయి వేసి జాగ్రత్త అన్నట్టు చెబుతాడు. ఓడిపోతే మాత్రం చిన్న క్లాస్ పీకుతాడు. మన కోసం, రికార్డుల కోసం కాదు ఆడేది.. దేశం కోసమని హితబోధలు చేస్తుంటాడని అన్నాడు.


కానీ ఒకసారి ధోనీ ఆగ్రహాన్ని డ్రెస్సింగ్ రూమ్ లో ప్రత్యక్షంగా చూశానని గుర్తు చేసుకున్నాడు. చెన్నై వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయాం. అనిల్ కుంబ్లే బౌలింగులో షాట్ కొట్టేందుకు ట్రై చేసి ఎల్బీగా పెవెలియన్ చేరాను. దాంతో అలాగే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లాను.

అక్కడే ఓ పక్కన ధోనీ కూర్చుని ఉన్నాడు. తన కాలి దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. దాన్ని బలంగా ఒక్క తన్ను తన్నాడు. అంతే నాకర్థమైంది. అది నేను ఆడిన తీరువల్లనే అలా తన్నాడని అనుకున్నాను. అప్పుడు ధోనీ కళ్లల్లోకి చూసేందుకు కూడా నాకు ధైర్యం సరిపోలేదని అన్నాడు. అయితే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆటలో గెలుపోటములు సహజం. కానీ ఆడాల్సిన మ్యాచ్ లో మాత్రం ఎవరైనా జాగ్రత్తగా ఆడాల్సిందేనని ధోనీ అంటూ ఉంటాడని అన్నాడు.

Also Read: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

అయితే ధోనీని కూల్ కెప్టెన్ అని అందరూ అంటూ ఉంటారు. కానీ తన వల్లనే కెరీర్ నాశనమైపోయిందని అనేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే తను కూడా మొదట అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఇలాగే తరచూ అవుట్ అయ్యాడు. సౌరవ్ గంగూలీ ఉండటంతో తనకి అవకాశాలు వచ్చాయి.

అయితే ధోనీ కూడా చాలామందికి లైఫ్ ఇచ్చాడు. అందులో విరాట్, రోహిత్, రవీంద్ర జడేజా ఇలా ఎందరో ఉన్నారని అంటారు. ఒకసారి కొహ్లీ కొత్తగా జట్టుకి వచ్చిన రోజుల్లో తరచూ విఫలమవుతుంటే.. తీసేద్దామని సెలక్షన్ కమిటీ అంటే.. అయితే నన్ను కూడా పక్కన పెట్టండని అన్నాడంట. అతనిలో ప్రతిభ ఉందని నమ్మితే, వారికోసం ఎంత దూరమైనా ధోనీ వెళతాడని అంటారు.  వారు భారత జట్టుకి ఉపయోగపడతారని భావిస్తే మాత్రం తప్పనిసరిగా ధోనీ అవకాశాలిస్తాడని అంటారు. మరి ఈరోజున కొహ్లీ ఏ స్థాయిలో ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయమే.

ఇకపోతే వచ్చే ఐపీఎల్ లో సీఎస్కే తరఫున ధోనీ ఆడతాడో లేదో తెలీదని అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి, ఐదేళ్లు అంతకంటే ఎక్కువ సమయం దాటిన క్రికెటర్లను అన్ క్యాప్ డ్ ప్లేయర్ గా తీసుకునే వెసులుబాటును ఫ్రాంచైజీలకు బీసీసీఐ కల్పించనుందనే వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే ధోనీ ఆటను తిరిగి చూసేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే కోచ్ గానో, మెంటార్ గానో చూడాల్సిందేనని అంటున్నారు.

Related News

IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?

Team India: పాకిస్తాన్ దారుణ ఓటమి.. ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ  

Babar Azam: 6 జంతువుల మాంసం తింటున్న బాబర్?

IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

T20 World Cup 2024: టీమిండియా దారుణ ఓటమి.. WC నుంచి ఔట్?

Ind vs Ban T20i : భారత్ క్లీన్ స్వీప్… మూడో టీ20లోనూ ఘన విజయం, సిరీస్ కైవసం

Big Stories

×