Team India: టి20 మహిళల ప్రపంచ కప్ లో టీమిండియా కు అత్యంత దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఎవరు ఊహించని విధంగా టీమిండియా… మహిళల టి20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం మహిళల పాకిస్తాన్ జట్టు. మహిళల పాకిస్తాన్ జట్టు దారుణంగా ఓడిపోవడంతో… ఈ టోర్నమెంట్ నుంచి టీమిండియా వైదొలగాల్సి వచ్చింది.
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా… ఇవాళ జరిగిన మ్యాచ్ లో పాక్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ విజయమే టీమిండియా కొంపముంచింది. ఈ మ్యాచ్ లో… న్యూజిలాండ్ చేతిలో 54 పరుగుల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది పాకిస్తాన్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది.
అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలంటే 111 పరుగులు చేయాల్సి ఉంది. కానీ బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు 11.4 ఓవర్లలోనే 56 పరుగులకు ఆల్ అవుట్ అయింది.దీంతో 54 పరుగుల తేడాతో పాకిస్తాన్… ఘోర ఓటమిని ఎదుర్కొంది. అయితే ఈ మ్యాచ్ ఓటమి నేపథ్యంలో… టీమిండియా తో పాటు పాకిస్తాన్ సెమీస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఇది ఇలా ఉండగా గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో న్యూజిలాండ్ కూడా అసలు చేరుకోవడం జరిగింది.