E-Paper
Advertisement

Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ డాక్యుమెంటరీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ డాక్యుమెంటరీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Advertisement

Anant Ambani Pre Wedding: కొన్నిరోజుల క్రితం జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరు గెస్టులుగా వచ్చారు.. ఇలాంటి చర్చలే జరిగాయి. దీనిపై మీమ్స్ కూడా విపరీతంగా వచ్చాయి. పెళ్లికంటే ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించే ఎక్కువమంది నెటిజన్లు మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటరీ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.

టీజర్ విడుదల

Advertisement

2024 మార్చిలో అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్‌ (Radhika Merchant)ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. దీనికి ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి చేసిన పర్ఫార్మెన్స్‌తో పాటు మరెన్నో పర్ఫార్మెన్స్‌లు కూడా ఈ ఈవెంట్‌లో హైలెట్ అయ్యాయి. అవన్నీ కూడా అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ డాక్యుమెంటరీలో భాగంకానున్నాయి. ‘వాలే ఆఫ్ గాడ్స్ జామ్‌నగర్’  (Valley Of Gods Jamnagar)పేరుతో ఈ డాక్యుమెంటరీ జియో సినిమాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. అంతే కాకుండా దానికి సంబంధించిన 1 నిమిషం నిడివి ఉన్న టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో నీతూ అంబానీ హైలెట్ అయ్యారు.

Also Read: బిగ్ బ్రేకింగ్.. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Advertisement

రెండే కోరికలు

జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ సెట్ చూపించడంతో ఈ ‘వాలే ఆఫ్ గాడ్స్ జామ్‌నగర్‌’ టీజర్ మొదలయ్యింది. ఆ తర్వాత నీతా అంబానీ మాట్లాడడం మొదలుపెడతారు. ‘‘జామ్ నగర్ మా మనసుల్లో ఒక స్పెషల్ ప్లేస్‌ను సంపాదించుకుంది. నా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి నాకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి. మొదటిది.. మా పూర్వీకుల ఆచారాలను నేను సెలబ్రేట్ చేయాలని అనుకున్నాను. రెండోది ఏంటంటే మా సెలబ్రేషన్ అనేది మన ఆర్ట్స్, కల్చర్‌కు నివాళిని అర్పించినట్టుగా ఉండాలని అనుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు నీతా అంబానీ. ఆమె అనుకున్నట్టుగానే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముందుగా వినాయకుడి పూజతో మొదలయ్యాయి. ఆ తర్వాత ముందుగా నీతా అంబానీ ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గెస్టులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ‘వాలే ఆఫ్ గాడ్స్ జామ్‌నగర్’ టీజర్‌లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ హైలెట్ అయ్యింది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అనే వార్త హైలెట్ అయ్యింది. ఇక పెళ్లి కోసం అయితే ఏకంగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను రంగంలోకి దించారు ముఖేష్ అంబానీ. జస్టిన్ బీబర్ ఇండియాకు రావడం, అనంత్ అంబానీ సంగీత్‌లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలామంది నమ్మలేకపోయారు కూడా.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×