Bigg Boss Sita: బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ నుంచి ఆరో వారాంకు కిర్రాక్ సీత తక్కువ ఓటింగ్ తో హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ ఇస్తారన్న విషయం తెలిసిందే.. ఆరవ వారం ఎలిమినేట్ అయిన ఈ అమ్మడు వెళ్తూ వెళ్తూ క్లోజ్ ఫ్రెండ్ విష్ణు ప్రియను పక్కన పెట్టేసి, తమ్ముడు నబిల్ అఫ్రిది విన్నర్ గా గెలవాలని కోరుకుంది. ఇది అందరిని షాక్ కు గురి చేసింది. ఇక ఒక్కొక్కరి గురించి ఆమె సంచలన విషయాలను చెప్పింది. అనంతరం ఆమె అంబటి అర్జున్ యాంకర్ గా చేస్తున్న బిగ్ బాస్ బజ్ షోలో మెరిసింది.. ఈ క్రమంలో తన మనసులోని కోరికను బయట పెట్టింది. ప్రస్తుతం ఆ కోరిక గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది..
ఈ ఇంటర్వ్యూ లో హౌస్ లో జరిగిన ప్రతి విషయాన్ని వివరించారు. హౌస్ లో మీ పతనం ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని మీరు గమనించారా ?’ అని అడగ్గా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని పంపడం వల్ల డౌన్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను అని వివరించింది. ఏడవడం అనేది స్ట్రాంగా? అని అడిగిన ప్రశ్నకి.. మరి అరవడం స్ట్రాంగా ? అంటూ అర్జున్ కే కౌంటర్ వేసింది ఈ కిరాక్ పాప. అయితే ‘ఎలిమినేట్ అయ్యాక మీ మంచితనమే కొంపముంచిందని మీరు ఎప్పుడూ అనుకోలేదు అని అర్జున్ అడిగారు. దానికి సీత అదేం కాదు అని వాదించింది. వీరిద్దరూ మాట్లాడిన మాటలు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్కరి ఫోటోలను సీత చేతికి అందించారు అర్జున్. అందులో టేస్టీ తేజ చిరాకుగా అనిపించాడంటూ వారమైనా సరే పెద్దగా పర్ఫామ్ చేసినట్టు, కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపించలేదు అని చెప్పి వేస్ట్ బిన్ లో పడేసింది సీత.. ఎక్కువగా తేజాపై కోపంగా ఉందని తెలుస్తుంది.
ఇక చివరగా ఈ అమ్మడు కోరిక గురించి అర్జున్ అడిగాడు.. మీ అమ్మ ఓ లెటర్ పంపింది కదా.. అందులో ఏముంది? అని అడగ్గా ఆమె ఎమోషనల్ అయ్యింది. ‘ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే దాని గురించి నాకు అసలు ఆలోచించాలనే లేదు. ఎందుకంటే నేను నాలాగే ఉన్నాను. సంతోషంగా బయటకు వచ్చాను. మా అమ్మని హౌస్ లో చూడాలనుకున్న కల ఒక్కటే తీరలేదు నాకు అంటూ ఏడ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మంచితనం చూపిస్తూ మెతగ్గా ఉండటమే సీతను బయటకు పంపించిందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన తల్లికి ఇచ్చిన మాటను తీర్చలేక పోయానని ఏడ్చేసింది. ఇక ఈ అమ్మడు భారీగానే రెమ్యూనరేషన్ కూడా అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తిగా మారింది.. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారంతా రెచ్చిపోతున్నారు..