BigTV English

Team India in Sri Lanka: శ్రీలంకలో టీమిండియా, నేటి నుంచి ప్రాక్టీసు.. ఆ తర్వాత రోహిత్, కోహ్లి..

Team India in Sri Lanka: శ్రీలంకలో టీమిండియా, నేటి నుంచి ప్రాక్టీసు.. ఆ తర్వాత రోహిత్, కోహ్లి..

Team India reaches Sri Lanka: టీమిండియా-శ్రీలంక మధ్య ఆసక్తిపోరు కొనసాగనుంది. ఈ టూర్‌లో భాగంగా టీ 20, వన్డే సిరీస్ జరగనున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు శ్రీలంకకు చేరుకున్నారు. ఈ రెండు జట్ల మధ్య జూలై 27న మొదటి టీ20 మ్యాచ్‌ జరగనుంది.


సోమవారం మధ్యాహ్నం ముంబై నుంచి బయలుదేరిన టీమిండియా ఆటగాళ్లు, సాయంత్రం మూడు గంట లకు కొలంబో చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆటగాళ్లకు సంప్రదాయ స్వాగతం లభించింది. అక్కడి ప్రత్యేక బస్సులో తమకు కేటాయించిన హోటల్‌కు చేరుకున్నారు.

మంగళవారం ఉదయం టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఆటగాళ్లు ప్రాక్టీసులో నిమగ్న మయ్యారు. ఈ సిరీస్‌లో మూడు టీ20 మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే జట్టు ఆటగాళ్లు వారం రోజుల తర్వాత శ్రీలంకకు వెళ్లనున్నారు. ప్రస్తుతం అమెరికా టూర్‌లో రోహిత్‌ శర్మ, లండన్ టూర్‌లో విరాట్‌కోహ్లీ బిజీగా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీలంకకు వెళ్లే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.


ALSO READ:  సీనియర్లు అన్ని సిరీస్ లు ఆడాల్సిందే: గంభీర్

ఈ టూర్‌తో టీమిండియాకు కొత్త శకం ప్రారంభంకానుంది. టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్, కోచ్ గా గౌతమ్‌గంభీర్ లు తమ ప్రస్థానం మొదలుపెట్టనున్నారు. ఈ టూర్‌కు స్టార్ ఆటగాడు బుమ్రా దూరం గా ఉన్నాడు. వన్డే జట్టుకు రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

టీ20 జట్టు.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్ (వైస్ కెప్టెన్), జైశ్వాల్, రిషబ్‌పంత్, రింకూసింగ్, సంజూశాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షరపటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్

 

 

Related News

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్

Indian Cricketers : టీమిండియా ప్లేయర్ల భార్యలందరూ ముస్లింసే.. ఇదిగో ప్రూఫ్!

Rahul Dravid-RCB : బెంగుళూరు కోసం రంగంలోకి ద్రావిడ్… ఇక RCB ఫ్యాన్స్ కు పండగే ?

Rohith Sharma : బాలీవుడ్ హీరోయిన్ పై మోజు పడుతున్న రోహిత్ శర్మ?

Sanju Samson : 30 సిక్స్ లతో రెచ్చిపోయిన సంజూ…నో లుక్ షాట్ వైరల్

Big Stories

×