BigTV English

Gautam Gambhir: సీనియర్లు అన్ని సిరీస్ లు ఆడాల్సిందే: గంభీర్

Gautam Gambhir: సీనియర్లు అన్ని సిరీస్ లు ఆడాల్సిందే: గంభీర్

Gautam Gambhir wants all the seniors to play the upcoming ODI series: సీనియర్లు ఇంతకాలం తమకు నచ్చిన సిరీస్ ఆడటం, లేదంటే వ్యక్తిగత కారణాలు చెప్పి మానేయడం సరికాదని టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. వారు తప్పనిసరిగా అన్ని మ్యాచ్ లు ఆడాల్సిందేనని అన్నాడు. ఎందుకంటే వారు ఉండటం వల్ల జట్టు సమతూకం ఉంటుంది. లేదంటే వారి ప్లేస్ లో వేరొకరు రావడం, వారు నిలదొక్కుకోవడం, ఈలోపు మేమున్నామంటూ వీరు రావడం, అంతవరకు ప్రయోగించిన వారిని పక్కన పెట్టడం సరికాదని అన్నాడు.


ఏ దేశంలో క్రికెట్ జట్టు చూసినా, ఒక ఫిక్స్ డ్ సెటప్ ఉంటుందని అన్నాడు. అలా వెళితేనే సక్సెస్ వస్తుందని నమ్ముతున్నట్టు తెలిపాడు. అంతేకాదు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా జట్టులో విలువైన ఆటగాళ్లని తెలిపాడు. వారిప్పటికే టీ 20 ఫార్మాట్ కి గుడ్ బై చెప్పేశారు. ఇక రెండే ఫార్మాట్లు ఉన్నాయి. అవి ఆడేందుకు వారికి బోలెడంత సమయం ఉంటుంది. వర్క్ లోడ్ కూడా ఉండదు. అవి కూడా ఆడమంటే మాత్రం కుదరదని అన్నాడు.

ఇప్పుడు శ్రీలంక పర్యటన చూసుకుంటే మూడు వన్డేలు మాత్రమే ఉన్నాయి. అంతా చూసుకుంటే అది కేవలం పదిరోజులు షెడ్యూల్ అంతేనని అన్నాడు. అదైన తర్వాత టీ 20 మొదలవుతుంది. అప్పుడు వారు తిరిగి ఇండియాకి వెళ్లిపోతారు. రాబోవు రోజుల్లో టీ 20కే ప్రాధాన్యత పెరుగుతోంది. అందువల్ల వారు ఫిట్ నెస్ కాపాడుకుంటే మాత్రం 2027 వరల్డ్ కప్ లో కూడా ఆడతారని అన్నాడు. వారిలో ఆ సత్తా ఉంది.


Also Read: ఉమెన్స్ ఆసియా కప్‌లో తొలి రికార్డ్.. సెంచరీ చేసిన చమరి

వారిద్దరూ ఆడటం టీమ్ ఇండియాకి ఎంతో శ్రేయోస్కరం. వారు ఉంటే బ్యాలన్స్ అవుతుందని అన్నాడు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్ లో విరాట్ ఒక్కడూ నిలబడి ఆడాడు. సీనియర్ల విలువ అప్పుడే బయటకు వస్తుంది. వారిని తక్కువ అంచనా వేయడానికి లేదని అన్నాడు. వారెంత గొప్ప ఆటగాళ్లో తనకి తెలుసునని, నేను కోచ్ గా సక్సెస్ కావాలంటే అలాంటి సీనియర్లు తనతో పాటు ఉండటం, ఒకరకంగా చెప్పాలంటే అదృష్టమని అన్నాడు.

ప్రతి మ్యాచ్ గెలవాల్సిందేనని అన్నాడు. గెలవాలనే కసి, పట్టుదల, తపన ఉన్నవారికే జాతీయ జట్టులో చోటు ఉంటుందని అన్నాడు. విజయాలు లభిస్తుంటేనే డ్రెస్సింగ్ రూమ్ కళకళలాడుతుందని తెలిపాడు. లేదంటే నైరాశ్యంలో మునిగిపోతుందని తెలిపాడు. ఒక కోచ్ గా ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూ, వారి సహజమైన ఆటకు భంగం రాకుండా విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Related News

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్

Indian Cricketers : టీమిండియా ప్లేయర్ల భార్యలందరూ ముస్లింసే.. ఇదిగో ప్రూఫ్!

Rahul Dravid-RCB : బెంగుళూరు కోసం రంగంలోకి ద్రావిడ్… ఇక RCB ఫ్యాన్స్ కు పండగే ?

Rohith Sharma : బాలీవుడ్ హీరోయిన్ పై మోజు పడుతున్న రోహిత్ శర్మ?

Sanju Samson : 30 సిక్స్ లతో రెచ్చిపోయిన సంజూ…నో లుక్ షాట్ వైరల్

Big Stories

×