IND Vs ENG 5th test : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ సిరీస్ లో భాగంగా లండన్ లోని ఓవల్ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులకు ఆలౌట్ అయింది. తాజాగా టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ జైస్వాల్ సెంచరీ చేయగా.. జడేజా, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ లు హాప్ సెంచరీ చేశారు. ముఖ్యంగా చివర్లో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ అదుర్స్ అనే చెప్పాలి. వాషింగ్టన్ టీ-20 మ్యాచ్ మాదిరిగా అద్భుతంగా ఆడటం విశేషం. ఇంగ్లాండ్ జట్టుకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ జట్టు 374 పరుగులు సాధిస్తే.. విజయం వరిస్తుంది. లేదంటే టీమిండియా విజయం సాధిస్తుంది.
Also Read : IND Vs ENG 5th Test : టీమిండియా కొత్త హిస్టరీ.. వరల్డ్ రికార్డు సమం..!
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా జట్టు 396 పరుగులకు ఆలౌట్ అయింది. జైస్వాల్ (118) సెంచరీ చేశాడు. అలాగే ఆకాశ్ దీప్ (66), వాషింగ్టన్ సుందర్ 53, జడేజా 53 హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ 5 వికెట్లతో సత్తా చాటారు. అట్కిన్సన్ 3, ఓవర్టన్ 2 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ జట్టు టార్గెట్ 374 పరుగులు. అయితే ఈ ఇన్నింగ్స్ చివర్లో వాషింగ్టన్ సుందర్ 4 భారీ సిక్స్ లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరోవైపు ధ్రువ్ జురెల్ 34 పరుగులు చేశాడు. పదో వికెట్ గా వాషింగ్టన్ సుందర్ ఔట్ కావడంతో టీమిండియా ఆలౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అట్కిన్సన్ వేసిన 87 ఓవర్ లో వరుసగా 446 బాది అర్దసెంచరీ చేశాడు వాషింగ్టన్ సుందర్.
జైస్వాల్ సెంచరీ
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 224 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లాండ్ జట్టును 247 పరుగులకే ఆలౌట్ చేశారు టీమిండియా బౌలర్లు. ఇక రెండో రోజు ఆట ముగింపులో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాయి సుదర్శన్ అవుట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు, డకెట్ ఏదో అనడంతో ఈ గొడవ మొదలైంది. ఓవల్ టెస్ట్ రెండో రోజు ఆట చివరి సెషన్‌లో, భారత రెండో ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 18వ ఓవర్‌లో, గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ను ఎల్బీడబ్ల్యూగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. మరోవైపు ఓవల్ గ్రౌండ్‌లో తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించిన జైస్వాల్, ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై ఒక సెంచరీ చేశాడు. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసిన జైస్వాల్, ఎడ్జ్‌బాస్టన్, మాంచెస్టర్‌లలో అర్ధ సెంచరీలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 87 రన్స్ సాధించగా.. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. దీనితో పాటు జైస్వాల్ రెండుసార్లు డకౌట్ అయ్యాడు.